అవినాష్ ను మోసం చేసింది చంద్రబాబు కాదా?

70 ఏళ్లు వచ్చినా సిగ్గుశరం లేకుండా మాట్లాడుతున్నావ్ చంద్రబాబు. తండ్రి చనిపోయిన దేవినేని అవినాష్‌ను తెచ్చి గుడివాడలో పెట్టావ్. ఆరోజే అవినాష్‌కు చెప్పా. నీవు చిన్నపిల్లాడివి, తండ్రి చనిపోయాడు. ఆలోచించుకో. చంద్రబాబు దొంగ, సన్నాసి. తండ్రి లేని పిల్లలతో ఆడుకుంటాడు అని చెప్పా. అవినాష్‌తో కోట్లు కోట్లు ఖర్చుపెట్టించాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ గుడివాడలో గెలవడం సాధ్యం కాదని తెలిసి అవినాష్‌ను తెచ్చి బలిపశువును చేశాడు. ఆ తర్వాత పక్కనపెట్టాడు. దాంతో అవినాష్‌ వైసీపీలో చేరాడు.

చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ తిరిగి అధికారంలోకి రాదు. ఇప్పటికైనా వెన్నుపోట్లు, నక్క ఆలోచనలు మానుకో. లేదు పిచ్చపిచ్చ నాటకాలు, డ్యాన్స్‌లు వేస్తే… ప్రజలు ఇసుకలోనే పూడ్చేస్తారు అంటూ… కొడాలి నాని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.