నీకు నువ్వే పోటుగాడివి అనుకోవద్దు… మీ పిల్లలు ఇంగ్లీషే కదా… మట్టి కొట్టుకుపోతావా?

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్ చేస్తున్న రాజకీయాలపై మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. చివరకు కులాలు, మతాల మీద రాజకీయాలు చేసే స్థితికి ఇద్దరు నేతలు దిగజారిపోయారని విమర్శించారు. టీడీపీని టైటానిక్‌ షిప్‌లా చంద్రబాబు ముంచేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యేలే చంద్రబాబును బూతులు తిడుతున్నారని నాని వ్యాఖ్యానించారు.

”సంక్షోభం నుంచి అవకాశాలు వెతుక్కోవాలంటూ శవాల మీద పేలాలు ఏరుకునే మొహం వేసుకుని చంద్రబాబు ఇసుక దీక్ష చేశారు. గతంలో కూడా ప్రజాస్వామ్యం కంప్రెషన్‌లోకి వెళ్లి పోయింది… ప్రొక్లెయినర్‌లోకి వెళ్లిపోయింది.. బొంగులోకి వెళ్లింది, బోసానంలోకి వెళ్లిపోయింది… అంటూ ఇట్లే 12 గంటల దీక్ష చేశాడు. ఢిల్లీకి వెళ్లి 10 కోట్లు ఖర్చు పెట్టి దీక్ష చేసి వచ్చాడు. జనం లాగి గూబమీద కొడితే మళ్లీ ఇక్కడ కూర్చోని..ఎవడి కాళ్లు పట్టుకుందామా అని ఎదురుచూస్తున్నాడు. మోడీ అపాయింట్‌మెంట్ కావాలి.. అమిత్ షా అపాయింట్‌మెంట్ కావాలి అంటూ వెతుకుతూ చివరకు కన్నా లక్ష్మీనారాయణ అపాయింట్‌మెంట్ ఇచ్చినా వెళ్లి కలిసే దౌర్బాగ్య పరిస్థితుల్లోకి వెళ్లిపోయాడు.

చార్జిషీట్‌ వేస్తాడట. ఎవడండి ఇతడు చార్జిషీట్ వేయడానికి. ఈయనేమైనా పోలీసా. చంద్రబాబు కనీసం కానిస్టేబుల్‌ కూడా కాదు. వీడెవడు చార్జిషీట్ వేయడానికి. వాడో 420 దొంగ. ఒక దొంగ అధికారుల మీద, మా మీద చార్జిషీట్‌ వేస్తాడా ?. ఇసుక ఆదాయం ప్రభుత్వానికి తీసుకురావాలి.. అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లకూడదని జగన్‌మోహన్ రెడ్డి పనిచేస్తుంటే చార్జిషీట్ వేస్తావా?.

ఇసుక పోరాట దీక్ష అంటూ మెడలో ఇసుక ప్యాకెట్ల దండ వేసుకుని కూర్చున్నాడు. తిన్న ఇసుక చాలదన్నట్టు. దీక్ష తర్వాత ఆ పార్టీ కార్యకర్త చెబుతున్నాడు. ఎందుకేశార్రా ఇసుక దండ… మోయలేడు కదా అంటే.. ఇసుక తిన్నాడు కదా సార్‌.. మాంసం తిన్నట్టు తెలియాలంటే బొక్కలు మెడలో వేయాలి కదా అని చెప్పాడు.

జగన్ క్రిస్టియనా… హిందువా, ముస్లింలా అన్నది ఇప్పుడెందుకు. ప్రజలేమైనా అడిగారా. 151 సీట్లతో ముఖ్యమంత్రిని చేస్తే…. తిరుపతిలో సంతకం పెట్టావా అంటావ్.. నీయమ్మ మొగుడు కట్టించాడా తిరుపతి గుడి. ఈ రాష్ట్రంలో పుట్టిన పౌరుడిగా జగన్‌మోహన్ రెడ్డి గారు ఏ గుడిలోకైనా, ఏ మసీదులోకైనా, ఏ చర్చిలోకైనా వెళ్లే హక్కు ఉంది. ఎవడికి సంతకం పెట్టాలి… ఎవడికి డిక్లరేషన్ ఇవ్వాలి?.

ఈయన పార్టనర్‌ పవన్ కల్యాణ్ ఉన్నాడు. చంద్రబాబు మాట్లాడిన గంట తర్వాత ఆయన కూడా అదే మాట్లాడుతాడు. జగన్‌మోహన్ రెడ్డికి కులం లేదు, మతం లేదు. ప్రజలంతా సమానమే. రెండు చోట్లా పోటీ చేసి ఒక్క చోట కూడా గెలవని వ్యక్తి ప్రశ్నిస్తే మేం కులాలు, మతాల గురించి చెప్పాలా?. రేపోమాపో చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా పోతుంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలే బూతులు తిడుతున్నారు. ఈ పార్టీని చంద్రబాబు టైటానిక్‌ షిప్‌లా ముంచుతాడని చాలా మంది ఎమ్మెల్యేలు మదనపడుతున్నారు. సొంత పార్టీలను సరిచేసుకోకుండా సిగ్గుశరం లేకుండా కులాలు, మతాలు ఎత్తుతున్నారు.

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ నడుపుతున్న స్కూల్‌ ఇంగ్లీష్ మీడియం కాదా?, చంద్రబాబు కొడుకు, మనవడు ఏ మీడియంలో చదివారు?. పవన్‌ కల్యాణ్‌ పిల్లలు ఇంగ్లీష్ మీడియం… ప్రజాప్రతినిధుల పిల్లలంతా ఇంగ్లీష్ మీడియం. పేద పిల్లలకు ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ నేర్పిస్తామంటే మట్టి కొట్టుకుపోవాలి, నాశనం అయిపోవాలి అంటూ పవన్ కల్యాణ్‌ సన్నాసి మాటలు మాట్లాడుతున్నాడు.

ఒకవేళ ఇంగ్లీష్ మీడియంలో పిల్లలను చదివిస్తే మట్టి కొట్టుకుపోవాలంటే తొలుత చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, నేను, అధికారులు, ప్రజాప్రతినిధులు మట్టి కొట్టుకుపోవాలి… ఆ తర్వాతే కదా జగన్‌కు వర్తించేది. పేదల పిల్లలకు ఇంగ్లీష్ నేర్పిస్తే మట్టి కొట్టుకుపోవాలా?. ఒళ్లు తెలియకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు.

151 ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టి జగన్‌ అని పిలవాలా, జగన్ మోహన్ రెడ్డి అని పిలవాలా… జగన్‌ రెడ్డి అని పిలవాలా అన్న దానిపై డైరెక్షన్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. మరి నీకు కూడా మీ తల్లిదండ్రులు ఒక పేరు పెట్టారు. సినిమాల్లోకి వచ్చాక ఇంకొ పేరు పెట్టారు. మీ అభిమానులు ఒక పేరు పెట్టారు. దురాభిమానులు మరో పేరు పెట్టారు. నీకు లక్ష పేర్లు పెట్టారు. నీవు కూడా ఓడిపోయిన నేతలతో సమావేశం పెట్టి నిన్ను ఏ పేరుతో పిలవాలో చెప్పు. చంద్రబాబు ఆశీస్సులతో వచ్చిన పేరుతో పిలవాలా?.

జగన్‌మోహన్ రెడ్డి అని పిలవడం ఇబ్బందిగా ఉంటే వైఎస్‌ జగన్‌ అను… అంతేగానీ మధ్యలో మోహన్‌ తీసేసి షార్ట్‌కట్‌గా జగన్‌ రెడ్డి అంటున్నావంటే నమ్మడానికి జనం గొర్రెలు అనుకుంటున్నారా?. మీకు మీరే పోటుగాళ్లం, మగాళ్లం అనుకుంటున్నారు” అంటూ కొడాలి నాని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.