డాన్ ను మించిన మయాంక్ అగర్వాల్

  • ఇండోర్ టెస్ట్ రెండోరోజు ఆటలో మయాంక్ షో

భారత యువఓపెనర్ మయాంక్ అగర్వాల్ తన కెరియర్ లో రెండో డబుల్ సెంచరీ సాధించడం ద్వారా క్రికెట్ ఆల్ టైమ్ గ్రేట్ డాన్ బ్రాడ్మన్ పేరుతో ఉన్న రికార్డును అధిగమించాడు.

ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలిటెస్టు రెండోరోజు ఆటలో మయాంక్ అగర్వాల్ 36 బౌండ్రీలు, 8 సిక్సర్లతో 243 పరుగులతో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు.

ఆస్ట్ర్రేలియా గ్రేట్ సర్ డాన్ బ్రాడ్మన్ తన కెరియర్ లో మొదటి రెండు ద్విశతకాలు సాధించడానికి 13 ఇన్నింగ్స్ ఆడితే… మయాంక్ అగర్వాల్ మాత్రం 12 ఇన్నింగ్స్ లోనే రెండు డబుల్ సెంచరీలు నమోదు చేయగలిగాడు.

టెస్ట్ క్రికెట్ చరిత్రలో కేవలం మొదటి 5 ఇన్నింగ్స్ లోనే రెండు ద్విశతకాలు సాధించిన రికార్డు మాత్రం వినోద్ కాంబ్లీకి మాత్రమే దక్కుతుంది.

మయాంక్ డబుల్ సెంచరీతో భారత్ రెండోరోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లకు 493 పరుగుల భారీస్కోరు సాధించగలిగింది.