Telugu Global
NEWS

చంద్రబాబువి చాలా వీడియోలున్నాయి... వాటిని ప్రదర్శించండి...

టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు ఎమ్మెల్యే వంశీ గట్టిగా స్పందించారు. గతంలో వైసీపీ గురించి వంశీ ఏమన్నారు.. ఇప్పుడు ఏమంటున్నారు అన్న దానికి సంబంధించి ‘నాడు- నేడు’ అంటూ టీడీపీ నేతలు మీడియా సమావేశంలో వీడియోలు ప్రదర్శించడంపై వంశీ ఫైర్ అయ్యారు. చంద్రబాబు పూటకో మాట చెప్పిన వీడియోలు లక్షల్లో ఉన్నాయని… వాటిని కూడా ప్రదర్శించాలని సవాల్ చేశారు. టికెట్ ఇచ్చిన కన్నతల్లి పార్టీకి మోసం చేశారని విమర్శిస్తున్నారని.. మరీ చంద్రబాబుకు టికెట్‌ ఇచ్చి మంత్రిని చేసిన తల్లిలాంటి […]

చంద్రబాబువి చాలా వీడియోలున్నాయి... వాటిని ప్రదర్శించండి...
X

టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు ఎమ్మెల్యే వంశీ గట్టిగా స్పందించారు. గతంలో వైసీపీ గురించి వంశీ ఏమన్నారు.. ఇప్పుడు ఏమంటున్నారు అన్న దానికి సంబంధించి ‘నాడు- నేడు’ అంటూ టీడీపీ నేతలు మీడియా సమావేశంలో వీడియోలు ప్రదర్శించడంపై వంశీ ఫైర్ అయ్యారు.

చంద్రబాబు పూటకో మాట చెప్పిన వీడియోలు లక్షల్లో ఉన్నాయని… వాటిని కూడా ప్రదర్శించాలని సవాల్ చేశారు. టికెట్ ఇచ్చిన కన్నతల్లి పార్టీకి మోసం చేశారని విమర్శిస్తున్నారని.. మరీ చంద్రబాబుకు టికెట్‌ ఇచ్చి మంత్రిని చేసిన తల్లిలాంటి కాంగ్రెస్‌ పార్టీని ఎందుకు వదిలేశారని వంశీ ప్రశ్నించారు.

వంశీని ఎమ్మెల్యేను చేశామని చెప్పుకుంటున్నారని.. కానీ ఎవరివల్లో తాను ఎమ్మెల్యే కాలేదని… కష్టపడి పైకి వచ్చానన్నారు. తానేమీ పప్పుగాడిలాగా రుద్దితే వచ్చిన వాడిని కాదన్నారు.

”చంద్రబాబుకు ఇందిరాగాంధీ ఎలా టికెట్ ఇచ్చారు?. చంద్రగిరి కోటకు సంస్ధానాధీశుడు కర్జూరనాయుడు అని ఆయన కుమారుడైన చంద్రబాబుకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారా ?. పార్టీ కన్నతల్లి అని కథలు చెబుతున్న చంద్రబాబు కాంగ్రెస్‌ను ఎందుకు వీడాడు?. నా వీడియోలు నాకు చూపించడం కాదు…. చంద్రబాబు మాట్లాడిన లక్షల వీడియోలున్నాయి వాటిని చూపించండి. ధర్మ పోరాట దీక్షల్లో మోడీని అమ్మ, పెళ్లాం అంటూ తిట్టాడు. ఇప్పుడెందుకు తిట్టడం లేదు. ఆ వీడియోలను ప్రదర్శించమనండి. నేను టీడీపీ నేతల దృష్టిలో వెధవనైతే చంద్రబాబు డబుల్ వెధవ… నేను సన్యాసి అయితే చంద్రబాబు డబుల్ సన్యాసి. చంద్రబాబు చేస్తే సంసారం మేం చేస్తే వ్యభిచారామా?.

ఎమ్మెల్యే టికెట్ వాడెవడో ఇచ్చేది ఏంది?. నేనేమైనా లోకేష్‌లా పప్పుగాడినా?. ఎవరి మీదైనా నన్ను రుద్దారా?. ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ కూతురు వివాహానికి 25 లక్షలు తీసుకెళ్లి నా సొంత డబ్బు ఇచ్చా. ఆ కృతజ్ఞత కూడా లేకుండా మాట్లాడితే ఊరుకోవాలా?. 2014లో నాకు పార్టీ ఒక్కపైసా కూడా ఇవ్వలేదు. మొన్నటి ఎన్నికల్లో ఎంపీ వాటా కింద డబ్బులు ఇచ్చారు. నాలాంటి వారు 100 మంది గెలిస్తే ముఖ్యమంత్రి అవ్వొచ్చు అన్న ఉద్దేశంతో చంద్రబాబు ఖర్చు పెట్టాడు. ఆ సొమ్ము ఏమైనా కర్జూరనాయుడు ఇచ్చిన రెండు ఎకరాల పొలాన్ని దున్ని సంపాదించాడా?. మేం పార్టీ కోసం ఖర్చు పెట్టలేదా?. వాళ్లు ఇచ్చేది ఏంది బొచ్చు. ఫలావు ప్యాకెట్‌కు, ఐదు వేల రూపాయల ప్యాకెట్‌ కోసం ప్రెస్‌మీట్లు పెట్టే వాడు కూడా తిడుతుంటే చూస్తూ ఊరుకోవాలా?”.

వంశీలాంటి వారు పోతే టీడీపీకి ఏం నష్టం లేదన్న లోకేష్ వ్యాఖ్యలపైనా వంశీ స్పందించారు. పప్పుగాడిలాంటి గుదిబండలు ఉంటే టీడీపీ పోతుందన్నారు. ఆ భారం మోయలేకే పార్టీ మునిగిపోతోందన్నారు.

పప్పుగాడు తను మంత్రిగా ఉన్నప్పుడు గన్నవరం నియోజకవర్గానికి ఏం నిధులు ఇచ్చారో ఆయన కుమారుడి మీద ప్రమాణం చేసి చెప్పాలన్నారు. ఐఏఎస్‌ అధికారి జవహర్‌ రెడ్డి సాయంతో తాను నిధులు తెచ్చుకున్నానన్నారు. తాను తిరుపతిలో చదువుకునేటప్పుడు జవహర్‌ రెడ్డి ఏడేళ్లు సీనియర్‌ అని… తాను కాలేజీలో చేరినప్పుడు ఆయన ఐఏఎస్‌ అయ్యారన్నారు. ఆ పరిచయంతో జవహర్‌ రెడ్డి ద్వారా నిధులు మంజూరు చేయించుకున్నానని వల్లభనేని వంశీ చెప్పారు. సోకాజ్ నోటీసు కాకపోతే గాడిద గుడ్డు ఇచ్చుకోమనండి… బొచ్చుగాళ్లు నాకు షోకాజ్ ఇచ్చేది ఏంది…. అని వంశీ ప్రశ్నించారు.

First Published:  16 Nov 2019 5:57 AM GMT
Next Story