ఏటీపీ టూర్ ఫైనల్స్ లో సెమీస్ లోనే ఫెదరర్ అవుట్

  • ఫైనల్లో గ్రీకువీరుడు సిటిస్ పాస్

2019 ఏటీపీ టూర్ సీజన్ ముగింపు టోర్నీ ఫైనల్స్ కు చేరడంలో ఆరుసార్లు విజేత రోజర్ ఫెదరర్ విఫలమయ్యాడు.

లండన్ వేదికగా జరుగుతున్న ఎనిమిదిమంది టాప్ ర్యాంక్ ప్లేయర్ల సమరంలో…ఇప్పటికే ప్రపంచ నంబర్ వన్ నడాల్, రెండో ర్యాంకర్ జోకోవిచ్ లీగ్ రౌండ్ నుంచే నిష్క్రమించగా…సెమీస్ కు అర్హత సాధించిన ఫెదరర్ మాత్రం ఫైనల్స్ చేరుకోడంలో విఫలమయ్యాడు.

ఏకపక్షంగా సాగిన తొలిసెమీఫైనల్లో గ్రీకువీరుడు, 21 సంవత్సరాల స్టెఫానోస్ సిటిస్ పాస్ 6-3, 6-4తో ప్రపంచ మూడో ర్యాంకర్ ఫెదరర్ పై సంచలన విజయంతో.. తన కెరియర్ లోనే తొలిసారి పైనల్స్ కు అర్హత సాధించగలిగాడు.

రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అలెగ్జాండర్ జ్వేరేవ్ తో డోమినిక్ ధీమ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు.