జూ. ఎన్టీఆర్‌ మాకు అవసరం లేదని ప్రకటించిన టీడీపీ

టీడీపీలో చంద్రబాబు తర్వాత నాయకత్వం ఎవరు అన్న దానిపై టీడీపీ అంతర్గతంగా చర్చ నడుస్తోంది. వల్లభనేని వంశీ టీడీపీ నాయకత్వంపై తిరుగుబాటు చేసిన నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్‌ అంశాన్ని కూడా ప్రస్తావించారు. జూనియర్ ఎన్టీఆర్ వస్తే నారా లోకేష్‌కు రాజకీయంగా అవకాశం ఉండదన్న ఉద్దేశంతోనే పద్దతి ప్రకారం జూనియర్ ఎన్టీఆర్‌ను దూరం పెడుతున్నారని వంశీ ఆరోపించారు.

ఈ నేపథ్యంలో టీడీపీ నేత వర్ల రామయ్య… జూ. ఎన్టీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అవసరం తమ పార్టీకి లేదని వ్యాఖ్యానించారు. ‘మాకు జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదు.. మా నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్’ అని వర్ల రామయ్య తేల్చిచెప్పారు.

జూనియర్ ఎన్టీఆర్ అవసరం తమకు లేదని వ్యాఖ్యానించింది వర్ల రామయ్య అయినప్పటికీ… పార్టీ నాయకత్వం డైరెక్షన్ లేనిదే ఇంత నేరుగా ఆ వ్యాఖ్యలు చేసి ఉండకపోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్‌తో అవసరం లేదన్నది చంద్రబాబు, నారా లోకేష్‌ల అభిప్రాయం. జస్ట్ వర్ల రామయ్య నోటి నుంచి వచ్చిందంతే.