కిడాంబీ శ్రీకాంత్ కు సెమీస్ షాక్

  • హాంకాంగ్ ఓపెన్లో ముగిసిన పోటీ

2019 సీజన్లో తొలి ఫైనల్స్ చేరాలన్న భారత బ్యాడ్మింటన్ ఆటగాడు కిడాంబీ శ్రీకాంత్ కల నెరవేరలేదు. హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ తొలిరౌండ్ నుంచి క్వార్టర్ ఫైనల్స్ వరకూ అలవోక విజయాలు సాధిస్తూ వచ్చిన కిడాంబీ శ్రీకాంత్ ను హాంకాంగ్ ఆటగాడు కంగు తినిపించాడు.

ఫైనల్లో చోటు కోసం హోరాహోరీగా సాగిన సెమీస్ లో 27వ ర్యాంకర్ లీ చుక్ హ్యూ 42 నిముషాల సమరంలో 13వ ర్యాంకర్ కిడాంబీ శ్రీకాంత్ ను 21-9, 25- 23తో ఇంటిదారి పట్టించాడు.

ప్రస్తుత సీజన్లో అంతంత మాత్రంగానే ఆడుతున్న కిడాంబీ..హాంకాంగ్ ఓపెన్లో మాత్రమే సెమీస్ వరకూ రాగలిగాడు.

మహిళల విభాగంలో సైనా నెహ్వాల్ తొలిరౌండ్లోనే చిత్తు కాగా…సింధు రెండోరౌండ్లోనే నిష్క్ర్రమించక తప్పలేదు.