మరోసారి అమెరికా వెళ్లిన నయనతార

షూటింగ్ కోసం కాకుండా తన వ్యక్తిగత పనుల మీద అమెరికా వెళ్లడం నయనతారకు అలవాటు. మరీ ముఖ్యంగా బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ తో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లడం ఆమెకు చాలా ఇష్టం. ఈసారి కూడా నయనతార అదే పని చేసింది. విఘ్నేష్ తో కలిసి అమెరికా చేరిపోయింది.

రేపు నయనతార పుట్టినరోజు. ఈ బర్త్ డే ను బాయ్ ఫ్రెండ్ తో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలనేది నయన్ ఆలోచన. అనుకున్నదే తడవుగా ఈ జంట అమెరికా చేరింది. న్యూయార్క్ లో భారీగా షాపింగ్ చేసింది. రేపంతా ఫుల్ గా ఎంజాయ్ చేయబోతోంది. ప్రస్తుతం న్యూయార్క్ నగర వీధుల్లో ఈ జంట చెట్టపట్టాలేసుకొని తిరుగుతోంది.

నయన్-విఘ్నేష్ ఇలా విదేశాలకు చెక్కేయడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. గతంలో విఘ్నేష్ పుట్టినరోజు సందర్భంగా నయనతార, అతడ్ని ఇలానే రెండు సార్లు విదేశాలకు తీసుకెళ్లింది. ఈసారి తన పుట్టినరోజు సందర్భంగా తీసుకెళ్లింది. విదేశాలైతే బాగానే చుట్టేస్తున్నారు కానీ పెళ్లెప్పుడు చేసుకుంటారనేది ఎవ్వరికీ తెలియదు.