వచ్చే వారమే సరిలేరు నీకెవ్వరు టీజర్

సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించి బిగ్ న్యూస్ బయటపెట్టాడు దర్శకుడు అనీల్ రావిపూడి. త్వరలోనే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించాడు. అక్కడితో ఆగకుండా ఓ చిన్న బిట్ కూడా రిలీజ్ చేశాడు. మిలట్రీ యూనిఫామ్ లో గన్ పట్టుకొని కోపంతో నడుస్తున్న మహేష్ విజువల్ ను దర్శకుడు ఇలా రిలీజ్ చేసిన వెంటనే అలా ఆ క్లిప్ వైరల్ అయింది.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, సరిలేరు నీకెవ్వరు సినిమా టీజర్ మరో 4-5 రోజుల్లో విడుదలకానుంది. తేదీకి సంబంధించి త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఆ వెంటనే సాంగ్స్ రిలీజ్ అవుతాయి. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, బండ్ల గణేశ్, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి కీలకమైన షెడ్యూల్ కేరళలో జరుగుతోంది. హీరోహీరోయిన్లతో పాటు యూనిట్ సభ్యులంతా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. కొన్ని డైలాగ్ వెర్షన్స్ తో పాటు.. ఓ ఫైట్ కూడా పిక్చరైజ్ చేశారు. హైదరాబాద్ వచ్చిన వెంటనే రామోజీ ఫిలింసిటీలో మరో షెడ్యూల్ మొదలవుతుంది. ఆ షెడ్యూల్ లో ఓ సాంగ్ తీయబోతున్నారు.