ఉదయనిధి మారన్‌పై పోస్టు నాది కాదు….

కరుణానిధి కుటుంబానికి చెందిన నటుడు ఉదయనిధిపై నటి శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్టు దర్శనమిచ్చింది.

సినిమా చాన్స్ ఇస్తానని చెప్పి ఉదయనిధి తనను మోసం చేశారంటూ శ్రీరెడ్డి పేరుతో సోషల్‌ మీడియాలో పోస్టు కనిపించింది. దీనిపై ఆమె వివరణ ఇచ్చారు. ఉదయనిధిపై తాను ఎలాంటి పోస్టు పెట్టలేదని చెప్పారు.

తాను ఇప్పటి వరకు ఉదయనిధిని ఒక్కసారి కూడా చూడలేదని వివరణ ఇచ్చింది. ఎవరో కావాలని తనను ఇబ్బంది పెట్టేందుకు ఇలాంటి ఫేక్ పోస్టు సృష్టించారని చెప్పారు. తన పేరుతో సోషల్ మీడియాలో చాలా ఫేక్ అకౌంట్లు ఉన్నాయని… వాటిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్టు చెప్పారు.

తనను తమిళ ప్రజలు ఆదరిస్తున్నారని.. త్వరలోనే రాజకీయాల్లోకి వచ్చి తమిళ ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నట్టు శ్రీరెడ్డి చెప్పారు. గతంలో తాను అనేక తప్పులు చేశానని.. ఇకపై అలాంటి తప్పులు చేయబోనని శ్రీరెడ్డి చెప్పారు.