Telugu Global
NEWS

ఖర్చు నాదే... మోడీ ఇంటి ముందు ధర్నా చేద్దాం బాబు...

ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అంత ఈజీగా ఎమ్మెల్యే పదవిని వదులుకునే సూచనలు కనిపించడం లేదు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా… ఎమ్మెల్యే పదవి తనకు అవసరం లేదని అంటూనే వంశీ కొత్త కండిషన్ పెట్టారు. రాజీనామా చేయడం తనకు ఒక్క క్షణం పని అని.. అయితే అంతకంటే ముందు టీడీపీ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన నలుగురు రాజ్యసభ ఎంపీలపై టీడీపీ సస్పెన్షన్ వేటు వేయాలని వంశీ డిమాండ్ చేశారు. తనను రాజీనామా […]

ఖర్చు నాదే... మోడీ ఇంటి ముందు ధర్నా చేద్దాం బాబు...
X

ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అంత ఈజీగా ఎమ్మెల్యే పదవిని వదులుకునే సూచనలు కనిపించడం లేదు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా… ఎమ్మెల్యే పదవి తనకు అవసరం లేదని అంటూనే వంశీ కొత్త కండిషన్ పెట్టారు. రాజీనామా చేయడం తనకు ఒక్క క్షణం పని అని.. అయితే అంతకంటే ముందు టీడీపీ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన నలుగురు రాజ్యసభ ఎంపీలపై టీడీపీ సస్పెన్షన్ వేటు వేయాలని వంశీ డిమాండ్ చేశారు. తనను రాజీనామా చేయాలని కోరుతున్న వారు.. మరి నలుగురు రాజ్యసభ సభ్యుల విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

విమాన చార్జీలతో పాటు ఇతర ఖర్చులు కూడా తానే భరిస్తానని… చంద్రబాబు, లోకేష్ వారి వెంట ఉండే తొట్టి గ్యాంగ్‌ ఢిల్లీకి రావాలని, నలుగురు ఫిరాయింపు రాజ్యసభ ఎంపీలపై అనర్హత వేటు వేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ప్రధాని ఇంటి ముందు కానీ, అమిత్ షా ఇంటి ముందు కానీ ధర్నా చేద్దామని వంశీ సవాల్ చేశారు. ఫిరాయింపు ఎంపీలకు వ్యతిరేకంగా చంద్రబాబు ఢిల్లీలో దీక్షకు వస్తే ఆ క్షణమే రాజీనామా సమర్పిస్తానన్నారు. నలుగురు ఎంపీలు ఫిరాయించినా సరే వారితో ఉదయం, మధ్నాహ్నం, రాత్రి కలిసి భోజనాలు చేస్తూ టీడీపీ పెద్దలు మాట్లాడుకోవడం లేదా అని వంశీ నిలదీశారు.

ఎన్నికలప్పుడు ఎమ్మెల్యేలుగా పోటీ చేసే ఎమ్మెల్సీల చేత రాజీనామా చేయించారని మరి నారా లోకేష్ మాత్రం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ప్రజల్లో గెలిచి వచ్చిన తమలాంటి వారు రాజీనామా చేయాలి… దొడ్డిదారిలో ఎమ్మెల్సీ అయిన లోకేష్ మాత్రం ఎన్నికల్లో ఓడిపోయినా సరే పదవులు వదులుకోరా అని వంశీ నిలదీశారు. టీడీపీలో చంద్రబాబు పాత్ర బొమ్మరిల్లు సినిమాలో ప్రకాశ్‌ రాజ్‌లా తయారైందన్నారు. గతంలో టీడీపీ నాయకత్వాన్ని నమ్మి జగన్‌మోహన్ రెడ్డిపై తాను విమర్శలు చేసిన మాట వాస్తవమేనని.. ఇప్పుడు తనకు జ్ఞానోదయం అయింది కాబట్టే వైఖరి మార్చుకున్నట్టు చెప్పారు. మిగిలిన టీడీపీ నేతలకు ఇంకా జ్ఞానోదయం కాకపోతే వారి కర్మ అని వంశీ వ్యాఖ్యానించారు.

అయ్యప్ప మాల వేసుకుని విమర్శలు చేయడం ఏమిటని తనను కొందరు ప్రశ్నిస్తున్నారని… మాల వేసుకున్న వ్యక్తిని తిట్టడం తప్పు అని రాజేంద్రప్రసాద్‌ను ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. తానేమైనా చంద్రబాబులాగా టీటీడీ చైర్మన్‌, బోర్డు సభ్యుల పదవులు అమ్ముకున్నానా?, దుర్గమ్మ ఆలయంలో క్షుద్రపూజలు చేయించానా?, తిరుమల వెయ్యి కాళ్ల మండపం కూల్చానా?, విశాఖ శారదాపీఠం వద్దకు ఎవరొస్తున్నారో తెలుసుకునేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటుచేశానా ? అని వంశీ ప్రశ్నించారు.

First Published:  16 Nov 2019 10:00 PM GMT
Next Story