వైసీపీ ఇసుక పాలసీ…. క్యాష్ చేసుకుంటున్న పవన్

ఏపీలో వైఎస్ జగన్ పాలనకు ఆరు నెలలు పూర్తి కాకముందే ప్రతిపక్ష చంద్రబాబు, ఆయన పార్టనర్ గా మన్ననలు అందుకున్న పవన్ కళ్యాణ్ చూపుతున్న వైఖరి అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.

తాజాగా రెండు విషయాల్లో వీరి పోరాటం.. ప్రజల్లోనూ చర్చనీయాంశమైంది. వర్షాలు పుష్కలంగా పడడం…. భారీగా వరదలు రావడంతో నదులు, వాగుల్లో నీరు నిలిచి ఇసుక దొరకకపోతే దాన్ని జగన్ పై నెట్టి వీరు చేసిన రాజకీయం అంతా ఇంతాకాదు..

తాజాగా జగన్ ఈరోజు పూర్తి స్థాయిలో ఇసుకను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రముఖ జాతీయ ఆంగ్ల దినపత్రికలైన ‘ది హిందూ’ సహా అన్నింటికి ప్రకటనలు ఇచ్చి జాతీయ స్థాయిలో చంద్రబాబు, పవన్ చేసిన డ్యామేజీని కంట్రోల్ చేశారు.

అయితే ఇప్పుడు దీన్ని కూడా క్యాష్ చేసుకుంటున్నారు పవన్. ఇది తమ విజయం అని.. తాము, ప్రజలు కలిసి చేసిన పోరాటం వల్లే వైఎస్ జగన్ మారారని క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకుంటున్నారు. తాజాగా పవన్ చేసిన ట్వీట్ పై వైసీపీ అభిమానులు మండిపడుతున్నారు.

వర్షాలతో పూర్తి స్థాయిలో నిండిన వాగులు, వంకల నుంచి ఇసుక తీయడం కష్టమైందని.. ఇప్పుడు వరద తగ్గడంతో ఇసుక దొరుకుతోందని.. వైసీపీ సర్కారు టీడీపీ ఇసుక దోపిడీకి చెక్ పెట్టి పారదర్శకంగా అమలు చేస్తుందని విమర్శిస్తున్నారు. టీడీపీ నేతల దోపిడీకి అడ్డుకట్టవేస్తే పవన్, చంద్రబాబు పెడబొబ్బలు పెట్టిన తీరును వైసీపీ నేతలు ఎండగడుతున్నారు.