Telugu Global
NEWS

ఆ పదివేల మెయిళ్లు పంపింది ఎవరు? వంశీ చెప్పిన పెద్దమనిషి ఆయనేనా?

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రేపిన తుఫాన్‌ కొనసాగుతోంది. టీడీపీ టార్గెట్‌గా ఆయన చేస్తున్న విమర్శలు హాట్‌ టాపిక్ అయ్యాయి. దీంతో ఆయనపై లేనిపోని ఆరోపణలను టీడీపీ సోషల్ మీడియా అప్‌లోడ్‌ చేస్తోంది. దీంతో వంశీ మళ్లీ వాళ్లే టార్గెట్‌గా సంచలనాలకు తెరలేపారు. కొన్ని రోజుల కిందట జరిగిన ఓ సంఘటను ఎత్తి చూపారు. హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌లోని ఓ ఇంటి నుంచి ఓ మహిళ మీద పదివేల ఈ మెయిల్స్‌ పెట్టారు. ఆమె వ్యక్తిత్వాన్ని కించపరచాలని చూశారు. […]

ఆ పదివేల మెయిళ్లు పంపింది ఎవరు? వంశీ చెప్పిన పెద్దమనిషి ఆయనేనా?
X

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రేపిన తుఫాన్‌ కొనసాగుతోంది. టీడీపీ టార్గెట్‌గా ఆయన చేస్తున్న విమర్శలు హాట్‌ టాపిక్ అయ్యాయి. దీంతో ఆయనపై లేనిపోని ఆరోపణలను టీడీపీ సోషల్ మీడియా అప్‌లోడ్‌ చేస్తోంది. దీంతో వంశీ మళ్లీ వాళ్లే టార్గెట్‌గా సంచలనాలకు తెరలేపారు.

కొన్ని రోజుల కిందట జరిగిన ఓ సంఘటను ఎత్తి చూపారు. హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌లోని ఓ ఇంటి నుంచి ఓ మహిళ మీద పదివేల ఈ మెయిల్స్‌ పెట్టారు. ఆమె వ్యక్తిత్వాన్ని కించపరచాలని చూశారు. చివరకు పోలీసులకు దొరికిపోయారు. వాళ్లు పిలిచి అడగడంతో రాష్ట్రంలో చాలా పెద్ద వ్యక్తి దొరికిపోయాడు. ఐపీ అడ్రస్‌ సహా అన్ని వివరాలు చెప్పడంతో ఆ మహిళతో కాళ్ల బేరానికి ఆ పెద్ద మనిషి వచ్చాడు. లిటరల్‌గా కాళ్లు పట్టుకున్నారు.

పోలీసులతో పాటు ఆ కుటుంబం సీరియస్‌గా నిలదీయడంతో తనకు తెలియకుండా జరిగిందని…తన ఇంట్లో వాళ్లు చేశారని కల్లబొల్లి కబుర్లు చెప్పాలని చూశారు. నీకు తెలియకుండా మీ ఇంట్లో జరుగుతుందా? అంటూ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇవ్వడంతో చివరకు చేసేదేమి లేకా కాళ్లు పట్టుకుని..ఆ కుటుంబాన్ని క్షమించాలని కోరి బయటపడ్డాడు. పెద్ద ఇంటివారిని వేధించాలని చూసి రాష్ట్రంలోని చాలా పెద్ద వ్యక్తి, ముఖ్య నేత దొరికిపోయాడని వంశీ చెప్పారు.

వంశీ చెప్పిన ఈ అంశంతో ఇప్పుడు టీడీపీ నేతలే ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇంతకీ ఆ మహిళను వేధించిన పెద్ద మనిషి ఎవరు? రాష్ట్రంలో చాలా పెద్ద వ్యక్తిని ఎవరిని వేధించారు? అసలు ఏం జరిగింది? అని చర్చనీయాంశంగా మారింది. కాళ్ల బేరానికి వెళ్లిన ఆ పెద్ద మనిషి ఎవరూ అంటూ టీడీపీ నేతలు ఎంక్వైరీ చేస్తున్నారు.

వంశీ మాత్రం మూడు రోజుల నుంచి ఆ పెద్ద మనిషి అని మాత్రమే చెబుతున్నారు. కానీ వ్యక్తిగతంగా ఆ మహిళ వివరాలు బయటపెట్టడం లేదు. దీంతో టీడీపీలోనే ఆ పెద్దమనిషి ఉంటారని తెలుస్తోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉండే పెద్దమనిషిపై ఇప్పుడు అందరి చూపు పడింది. దీంతో రాబోయే రోజుల్లో ఈమెయిల్ వ్యవహారం కూడా టీడీపీకి పెద్ద తలనొప్పి తీసుకువచ్చే సూచనలు కన్పిస్తున్నాయి.

First Published:  18 Nov 2019 2:23 AM GMT
Next Story