డాక్ట‌ర్ పేరుతో వేషం… 20 మంది మ‌హిళ‌ల‌కు వ‌ల !

విశాఖ‌లో కేటుగాడి వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డింది. వంకా కుమార్ అలియాస్ డాక్ట‌ర్ అజిత్ క‌మార్‌. మెడ‌లో స్టెత్‌స్కోప్‌. డాక్ట‌ర్‌లా బిల్డ‌ప్‌. వైద్యుడి వేషంలో ఫోటోలు తీసుకుని వాటిని మ‌హిళ‌ల‌కు చూపించి..మాయ‌మాట‌ల‌తో ట్రాప్ చేసి..వారిని లైంగికంగా వాడుకోవ‌డం ఈయనకు అలవాటు.

ఆత‌ర్వాత ఆ ఫోటోలు, వీడియోలు చూపించి డ‌బ్బులు వ‌సూలు చేయ‌డం మ‌రో హాబీ. వారి ద‌గ్గ‌ర న‌గ‌దు, న‌గ‌లు దోచుకుంటాడు. పెళ్లైన మ‌హిళ‌లను టార్గెట్ చేసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్ప‌డ్డాడు. తులాల కొద్దీ బంగారం, ల‌క్ష‌ల కొద్దీ న‌గ‌దు వ‌సూలు చేశాడు.

ఇప్ప‌టివ‌ర‌కూ 20 మంది మ‌హిళ‌లు వీడి వ‌ల‌లో ప‌డ్డారు. చివ‌రిగా ఓ బాధితురాలు ధైర్యంగా ముందుకు వ‌చ్చి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

దీంతో కేసును సీరియ‌స్‌గా టేక‌ప్ చేసి వంకా కుమార్‌పై చీటింగ్‌, రేప్‌తో పాటు ఏడు సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేశారు. ఎట్ట‌కేల‌కు ఈ న‌కిలీ డాక్ట‌ర్‌ను అరెస్టు చేశారు. వంకా కుమార్‌ తో చేతులు క‌లిపి ఫోటోలు తీస్తూ బ్లాక్‌మెయిలింగ్‌కు స‌హ‌క‌రించిన మ‌ణికంఠ‌ను కూడా ఈ కేసులో నిందితుడుగా చేర్చారు.

వైసీపీ ప్రభుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న స్పంద‌న కార్య‌క్ర‌మంలో భాదితురాలు త‌న గోడు చెప్పుకుంది. దీంతో పోలీసులు సీరియ‌స్‌గా ఈ ఇష్యూ తీసుకుని టేకప్ చేసిన‌ట్లు చెప్పారు.