జగన్‌ దంపతులకు గవర్నర్ విందు

ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి దంపతులు రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆహ్వానం మేరకు జగన్ దంపతులు రాజ్‌భవన్ వెళ్లారు. గవర్నర్ దంపతులు… జగన్‌ దంపతులకు స్వాగతం కలిపారు. కలిసి భోజనం చేశారు.

దాదాపు గంట పాటు ముఖ్యమంత్రి దంపతులు రాజ్‌భవన్‌లో గడిపారు. ఈ సందర్భంగా గవర్నర్, ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు.

రాష్ట్రంలోని పరిస్థితులు, ప్రభుత్వ పథకాలు, అసెంబ్లీ సమావేశాలు వంటి అంశాలను గవర్నర్‌కు సీఎం వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి దంపతులు క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు.