Telugu Global
National

మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని రాధాకృష్ణపై దళిత సంఘాల ఫిర్యాదు

ఇంగ్లీష్‌ ప్రవేశపెట్టడం వెనుక మత మార్పిడి కోణం ఉందని.. భవిష్యత్తులో ఏపీలో మత ఘర్షణలు జరిగే అవకాశం ఉంది అంటూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన పత్రిక ద్వారా ప్రచారం చేయడంపై పలు సంఘాలు అభ్యంతరం తెలుపుతున్నాయి. ఇంత బహిరంగంగా మతాల మధ్య చిచ్చపెట్టేలా, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కథనం రాయడంతో పాటు… ఏకంగా మత ఘర్షణలు జరుగుతాయని చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మత ఘర్షణలు […]

మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని రాధాకృష్ణపై దళిత సంఘాల ఫిర్యాదు
X

ఇంగ్లీష్‌ ప్రవేశపెట్టడం వెనుక మత మార్పిడి కోణం ఉందని.. భవిష్యత్తులో ఏపీలో మత ఘర్షణలు జరిగే అవకాశం ఉంది అంటూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన పత్రిక ద్వారా ప్రచారం చేయడంపై పలు సంఘాలు అభ్యంతరం తెలుపుతున్నాయి.

ఇంత బహిరంగంగా మతాల మధ్య చిచ్చపెట్టేలా, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కథనం రాయడంతో పాటు… ఏకంగా మత ఘర్షణలు జరుగుతాయని చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మత ఘర్షణలు జరుగుతాయిని రాధాకృష్ణ అంత ఓపెన్‌గా రెచ్చగొడుతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వం నుంచి ఉలుకూ పలుకు లేకపోవడంతో కొందరు సొంతంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి, సమాజంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలంటూ ఆలిండియా దళిత హక్కుల వేదిక పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్‌కు ఫిర్యాదు చేసింది.

ఆంధ్రజ్యోతిలో మత విద్వేషాలను రగిల్చేలా వచ్చిన కథనాలను, రాధాకృష్ణ రాసిన ఆర్టికల్‌ను ఫిర్యాదుకు జత చేశారు.

రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని… ముఖ్యమంత్రి, హోంమంత్రి మౌనం వీడి ఈ అంశంపై స్పందించాలని సంఘం నాయకులు కోరారు.

First Published:  18 Nov 2019 10:38 PM GMT
Next Story