Telugu Global
International

పాక్‌ దళాలకు చిక్కిన తెలుగు సాప్ట్‌వేర్ ఇంజనీర్

విశాఖకు చెందిన ప్రశాంత్ అనే స్టాప్‌వేర్‌ ఇంజనీర్‌ను పాక్‌ భద్రతాదళాలు అరెస్ట్ చేశాయి. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న బహవాల్‌పూర్‌లో ఇద్దరు భారత యువకున్ని పాక్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 14న వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో విశాఖకు చెందిన ప్రశాంత్‌ ఉన్నాడు. మరో యువకుడు మధ్యప్రదేశ్‌కు చెందిన దరీలాల్‌. అక్రమంగా పాక్‌లోకి చొరబడినందుకు వీరిని అదుపులోకి తీసుకున్నారని అంతర్జాతీయ మీడియాలో కథలు వస్తున్నాయి. ప్రశాంత్ సాప్ట్‌వేర్‌ ఇంజనీర్ కావడంతో భారత ప్రభుత్వమే వీరిని కుట్రపూరితంగా […]

పాక్‌ దళాలకు చిక్కిన తెలుగు సాప్ట్‌వేర్ ఇంజనీర్
X

విశాఖకు చెందిన ప్రశాంత్ అనే స్టాప్‌వేర్‌ ఇంజనీర్‌ను పాక్‌ భద్రతాదళాలు అరెస్ట్ చేశాయి. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న బహవాల్‌పూర్‌లో ఇద్దరు భారత యువకున్ని పాక్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 14న వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో విశాఖకు చెందిన ప్రశాంత్‌ ఉన్నాడు. మరో యువకుడు మధ్యప్రదేశ్‌కు చెందిన దరీలాల్‌.

అక్రమంగా పాక్‌లోకి చొరబడినందుకు వీరిని అదుపులోకి తీసుకున్నారని అంతర్జాతీయ మీడియాలో కథలు వస్తున్నాయి. ప్రశాంత్ సాప్ట్‌వేర్‌ ఇంజనీర్ కావడంతో భారత ప్రభుత్వమే వీరిని కుట్రపూరితంగా ప్రత్యేక ఆపరేషన్‌ కోసం తమ దేశంలోకి పంపిందని పాక్‌ ఆరోపిస్తోంది. ప్రశాంత్‌ది విశాఖ అని.. అతడి తండ్రి పేరు బాబూరావు అని ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచారు.

పాక్ పోలీసుల అదుపులో ఉన్న ప్రశాంత్ వారి అనుమతితో తన తల్లిదండ్రులకు ఒక వీడియో మేసేజ్ పంపించాడు. ”మమ్మీ డాడీ బాగున్నారా? ఇక్కడంతా బాగానే ఉంది. నన్ను ఇప్పుడు పోలీసుస్టేషన్‌ నుంచి కోర్టుకు తీసుకొచ్చారు. ఏ ప్రాబ్లం లేదని డిక్లేర్‌ అయిన తర్వాత కోర్టుకు తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి జైలుకు తీసుకెళ్తారు. అక్కడ నుంచి వాళ్లు ఇండియన్‌ ఎంబసీకి సమాచారమిస్తారు. జైలుకెళ్లాక బెయిల్‌ ప్రాసెస్‌ ఉంటుంది. అప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్‌ చెయ్యడం అవుతుంది. ఇండియా వాళ్లు, పాకిస్తాన్‌ వాళ్లు ఎక్స్‌చేంజ్‌ చేసుకుంటారు. దీనికి ఓ నెల వరకు పడుతుంది…” అంటూ ప్రశాంత్‌ తన వీడియోలో వివరించాడు. ప్రశాంత్‌ రెండేళ్ల క్రితమే ఇంటి నుంచి వెళ్లిపోయాడని.. అప్పటి నుంచి అతడి ఆచూకీ లేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

భారత్‌కుచెందిన ఇద్దరు యువకులు పట్టుబడడం, అంతర్జాతీయ మీడియాలో కూడా కథనాలు వస్తుండడంతో భారత్ ప్రభుత్వం అప్రమత్తమైంది. పట్టుబడిన ఇద్దరు యువకుల గురించి రాష్ట్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఆరా తీస్తోంది.

రాజస్థాన్‌లోని థార్‌ ఏడాది వల్ల వీచే ప్రచండ గాలుల వల్ల ఇసుక తిన్నెలు ఒక చోటు నుంచి మరొక చోటికి మారడం వల్ల సరిహద్దు గుర్తులు కూడా కనిపించకుండాపోతుంటాయని… ఆ సమయంలో తెలియక సరిహద్దు దాటినప్పుడు పాక్ దళాలు అదుపులోకి తీసుకుంటున్నాయని భారత అధికారులు చెబుతున్నారు. పట్టుబడిన ఇద్దరు యువకుల విషయంలోనూ అదే జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

First Published:  19 Nov 2019 12:50 AM GMT
Next Story