ఈసారి కూడా ప్రభాస్ రెండు గెటప్స్

బాహుబలి సినిమాలో తండ్రికొడుకుగా రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించాడు ప్రభాస్. ఈ రెండు పాత్రల కోసం బాగానే మేకోవర్ కూడా అయ్యాడు. ఇక సాహోలో మేకోవర్స్ లేకపోయినా.. డాన్ గా, పోలీస్ గా రెండు షేడ్స్ లో కనిపించి మెప్పించాడు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న జాన్ సినిమాలో కూడా ప్రభాస్ ఇలానే రెండు షేడ్స్ లో కనిపించబోతున్నాడు. కాకపోతే ఈసారి మేకోవర్ తప్పలేదు.

జాన్ సినిమా కోసం ఇప్పటికే కొంత భాగం షూట్ పూర్తిచేశారు. పూజా హెగ్డే కాంబినేషన్ లో ఓ షెడ్యూల్ పూర్తిచేశారు. ఆ సన్నివేశాల కోసం స్లిమ్ గా కనిపించిన ప్రభాస్, ఇప్పుడు మరోసారి లావెక్కుతున్నాడు. రీసెంట్ గా నిర్మాత లక్ష్మణ్ (దిల్ రాజుకు సహ నిర్మాత) కొడుకు ఎంగేజ్ మెంట్ లో కనిపించిన ప్రభాస్, అందరికీ షాక్ ఇచ్చాడు.

బాగా లావెక్కాడు ప్రభాస్. పెద్ద బుగ్గలు, భారీకాయంతో దిట్టంగా కనిపిస్తున్నాడు. ఈ గెటప్ తోనే జాన్ నెక్ట్స్ షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నాడు. అయితే ఈ షెడ్యూల్ లో పూజా హెగ్డే లేకుండానే సన్నివేశాలు తీయబోతున్నారు. కేవలం ప్రభాస్ బల్కీ లుక్ కోసమే సినిమాకు 4 నెలలు గ్యాప్ ఇచ్చారనే విషయం ఇప్పుడు అందరికీ అర్థమైంది. త్వరలోనే రామోజీ ఫిలింసిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ప్రభాస్ పై కొన్ని సన్నివేశాలు తీయబోతున్నారు.