Telugu Global
NEWS

రాజాసింగ్ ఎంట్రీ.... వివాదంలో ‘జార్జిరెడ్డి’

జార్జిరెడ్డి… ఇప్పుడీ ఉస్మానియా విద్యార్థి నాయకుడిపై రాబోతున్న సినిమా తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తుంది. జార్జిరెడ్డి మూవీ తాజా ట్రైలర్ వివాదానికి ఆజ్యం పోసింది. ఈ మూవీ ట్రైలర్ లో వామపక్ష విద్యార్థి నాయకుడిగా ఉస్మానియాలో విజయబావుటా ఎగురవేసిన జార్జిరెడ్డిని… కొందరు హిందుత్వ విద్యార్థి నాయకులు హత్య చేసినట్లు చూపించడం దుమారం రేపింది. ఏబీవీపీని విలన్ గా చూపించిన ఈ సినిమాను అడ్డుకుంటామని.. ఆడనీయమని తాజాగా తెలంగాణలో బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించడం వివాదానికి ఆజ్యం […]

రాజాసింగ్ ఎంట్రీ.... వివాదంలో ‘జార్జిరెడ్డి’
X

జార్జిరెడ్డి… ఇప్పుడీ ఉస్మానియా విద్యార్థి నాయకుడిపై రాబోతున్న సినిమా తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తుంది. జార్జిరెడ్డి మూవీ తాజా ట్రైలర్ వివాదానికి ఆజ్యం పోసింది.

ఈ మూవీ ట్రైలర్ లో వామపక్ష విద్యార్థి నాయకుడిగా ఉస్మానియాలో విజయబావుటా ఎగురవేసిన జార్జిరెడ్డిని… కొందరు హిందుత్వ విద్యార్థి నాయకులు హత్య చేసినట్లు చూపించడం దుమారం రేపింది.

ఏబీవీపీని విలన్ గా చూపించిన ఈ సినిమాను అడ్డుకుంటామని.. ఆడనీయమని తాజాగా తెలంగాణలో బీజేపీ ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించడం వివాదానికి ఆజ్యం పోసింది.

తాజాగా ‘జార్జిరెడ్డి’ మూవీపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నిప్పులు చెరిగారు. జార్జిరెడ్డి హత్య కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిందని.. ఏబీవీపీకి చెందిన వ్యక్తులే ఈ హత్య చేశారన్నట్టుగా ఈ సినిమాలో చూపించారని మండిపడ్డారు. అబద్ధాలు చూపిస్తే తాము అడ్డుకుంటామని రాజాసింగ్ స్పష్టం చేశారు. దీనికి 100 రెట్లు మా రియక్షన్ ఉంటుంది అని హెచ్చరించారు.

జార్జిరెడ్డి ట్రైలర్ లో తమ బీజేపీ విద్యార్థి సంఘం ఏబీవీపీపై అవాస్తవాలు చూపిస్తూ… వన్ సైడ్ గా చూపించారని.. సినిమా ముసుగులో ఏబీవీపీని కించపరిస్తే సహించమని…. అడ్డుకుంటామని హెచ్చరించారు.

సినిమాకు సెన్సార్ బోర్డు ఎలా పర్మిషన్ ఇచ్చిందని.. దీనిలోని కొన్ని సీన్లను కట్ చేయాలని స్పష్టం చేశారు. జార్జిరెడ్డి ట్రైలర్ పై రాజాసింగ్ పలు అభ్యంతరాలను వ్యక్తం చేశారు.

మరి తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ పై బీజేపీ అభ్యంతరాల నేపథ్యంలో…. సినిమా విడుదలవుతుందా లేదా అన్నది ఆసక్తి రేపుతోంది.

First Published:  20 Nov 2019 12:45 AM GMT
Next Story