‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ ట్రైలర్-2…. వర్మ మరో సంచలనం….

‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ సినిమా ట్రైలర్ -2 ను తాజాగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ విడుదల చేశారు. ఇప్పటికే పోస్టర్, టీచర్, ట్రైలర్ లతో వర్మ వేసిన బాంబులకు టీడీపీ శిబిరం బెంబేలెత్తిపోగా.. తాజాగా మరో ట్రైలర్ తో లోకేష్ ను, హీరో ఎన్టీఆర్ ను కూడా వర్మ టార్గెట్ చేశారు. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ రాజకీయ, సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రాంగోపాల్ వర్మ వాయిస్ తో మొదలైన టీజర్ లో అనేక ట్విస్టులున్నాయి. చంద్రబాబు ఓడిపోయాక టీడీపీ అంతర్గత సమావేశంలో చంద్రబాబు వయసు అయిపోయిందని.. బుడ్డోడు(ఎన్టీఆర్ ను ఉద్దేశించి) టీడీపీని ఈ ఐదేళ్లలో లాగేసుకోకుంటే అదే పదివేలు అని టీడీపీ నేతలు అనడం హాట్ టాపిక్ గా మారింది.

కుమారుడు లోకేష్ భవిష్యత్ కోసం పార్టీని ఫణంగా పెట్టి చంద్రబాబు ఓడించాడని నేతలు ఆడిపోసుకున్న వైనం కూడా కనిపించింది.

ప్రధానంగా కొడుకు లోకేష్ పై ప్రేమతో చంద్రబాబు పార్టీని నాశనం చేశాడని.. పవన్ ను చంద్రబాబు ఎలా ఉపయోగించుకున్నాడన్నది ట్రైలర్ లో వర్మ చూపించాడు.

ఇక జగన్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు చేసిన తీరును చూపించి ఆర్జీవీ సంచలనం సృష్టించాడు.

ఇక ట్రైలర్ లో పవన్ కళ్యాణ్, లోకేష్ ల గురించి ప్రధానంగా వర్మ టార్గెట్ చేశారు. వంగవీటి రంగా మర్డర్ ను లోకేష్ పాత్రధారితో పలికించి ఆ నేతపై కూడా సెటైర్లు వేశారు. ఇలా మొత్తంగా వర్మ తాజా ట్రైలర్ ఆసక్తి రేపుతోంది.

ట్రైలర్ ఇదే..