తీన్ మార్ హీరోయిన్ ప్రేమలో పడింది

తీన్ మార్ సినిమా గుర్తుందా.. అందులో పవన్ కల్యాణ్ ప్రేయసిగా నటించిన కృతి కర్బందా గుర్తుందా.. ఇప్పుడీ అమ్మడు మరోసారి వార్తల్లోకెక్కింది. తన ప్రేమ విషయాన్ని స్వయంగా బయటపెట్టింది కృతి కర్బాందా. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. సహ నటుడు పుల్ కిత్ సామ్రాట్ తో డేటింగ్ చేస్తున్న విషయాన్ని బయటపెట్టింది.

అనీల్ కపూర్, జాన్ అబ్రహాం హీరోలుగా రాబోతోంది పాగల్ పంతి సినిమా. ఇదే సినిమాలో కృతి కర్బంద, పులకిత్ సామ్రాట్ కూడా నటించారు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా తన లవ్ మేటర్ ను బయటపెట్టింది కృతి. ఇంట్లో పెద్దలకు కూడా తమ లవ్ మేటర్ చెప్పేశామని, అందుకే ఇప్పుడు అధికారికంగా మీడియాకు చెబుతున్నామని ప్రకటించింది కృతి.

కృతి కెరీర్ తెలుగులోనే మొదలైంది. సుమంత్ హీరోగా నటించిన బోణి సినిమాతో ఆమె బోణీ కొట్టింది. అయితే ఆ తర్వాత ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. కల్యాణ్ రామ్, మంచు మనోజ్, రామ్ లాంటి హీరోల సరసన నటించినా ఆమెకు పెద్దగా కలిసొచ్చిందేం లేదు. చివరికి రామ్ చరణ్ కు అక్కగా కూడా నటించేసింది.

ఇలాంటి టైమ్ లో ఊహించని విధంగా బాలీవుడ్ లో క్లిక్ అయింది కృతి కర్బందా. రీసెంట్ గా ఆమె నటించిన హౌజ్ ఫుల్ 4 సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పుడు పాగల్ పంతి కూడా వస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో మరో 2 బాలీవుడ్ ప్రాజెక్టులున్నాయి.