చిన్న సినిమాల మధ్య పెద్ద పోటీ

ఈ వీకెండ్ ఏకంగా 7 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అన్నీ చిన్న సినిమాలే. కాకపోతే పేరుకు ఇవి చిన్న సినిమాలే అయినప్పటికీ పోటీ మాత్రం గట్టిగా ఉంది. మరీ ముఖ్యంగా కంటెంట్ పరంగా రాగల 24 గంటల్లో, జార్జ్ రెడ్డి సినిమాల మధ్య ప్రధానంగా పోటీ నడుస్తోంది.

ఈషారెబ్బ, సత్యదేవ్ నటించిన సినిమా రాగల 24 గంటల్లో. శ్రీనివాసరెడ్డి డైరక్ట్ చేసిన ఈ సినిమా ఓ మర్డర్ మిస్టరీ. ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి.

అయితే దీనికంటే ఎక్కువగా జార్జ్ రెడ్డి సినిమాపై ఉన్నాయి. సందీప్ హీరోగా నటించిన ఈ సినిమా ట్రయిలర్ సూపర్ హిట్ అయింది. పైగా టాలీవుడ్ ప్రముఖులు చాలామంది ఈ సినిమాకు ప్రచారం చేస్తున్నారు.

ఈ రెండు సినిమాలతో పాటు.. రాజేంద్రప్రసాద్ లీడ్ రోల్ లో తోలుబొమ్మలాట అనే సినిమా వస్తోంది. ‘మనిషి జీవితమే ఓ తోలుబొమ్మలాట…’ అనే థీమ్ తో తెరకెక్కింది ఈ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్.

ఈ మూవీతో పాటు బీచ్ రోడ్ చేతన్, ట్రాప్ అనే మరో రెండు సినిమాలు కూడా వస్తున్నాయి. వీటిలో బీచ్ రోడ్ చేతన్ సినిమాను మొదటి రోజు మొదటి ఆట ఫ్రీగా ప్రదర్శిస్తున్నారు. ఇదొక పబ్లిసిటీ స్టంట్.

ఈ సినిమాలతో పాటు ఈ వీకెండ్ 2 డబ్బింగ్ సినిమాలు కూడా రెడీగా ఉన్నాయి. మమ్ముట్టి నటించిన మలయాళ మూవీ మధురరాజా… రాజా నరసింహగా తెలుగులోకి వస్తోంది. అటు జ్యోతిక నటించిన జాక్ పాట్ అనే సినిమా కూడా సేమ్ టైటిల్ తో తెలుగులో థియేటర్లలోకి వస్తోంది. వీటిలో ఎన్ని సినిమాలు ఆడుతాయో చూడాలి.