సైరా రిలీజ్ కాబోతోంది….

అదేంటి.. సైరా సినిమా ఆల్రెడీ రిలీజైంది కదా. ఈరోజుతో 50 రోజులు కూడా పూర్తిచేసుకుంది. మరికొత్తగా ఈ రిలీజ్ ఏంటని అనుకుంటున్నారా? నిజంగానే రేపు సైరా రిలీజ్ అవుతోంది. కాకపోతే థియేటర్లలో కాదు, అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో. ఈ సినిమా అమెజాన్ లో ఎప్పుడు వస్తుందా మరోసారి చూద్దామని చాలామంది వెయిటింగ్. అందుకే రేపే రిలీజ్ అంటూ మరోసారి హెడ్ లైన్స్ దర్శనమిస్తున్నాయి.

దాదాపు 25 కోట్ల రూపాయలు పెట్టి సైరా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కొనుగోలు చేసుకుంది అమెజాన్. విడుదలైన 4 వారాలకే సినిమాను స్ట్రీమింగ్ కు ఇస్తే మరో 5 కోట్లు అదనంగా ఇస్తామని ఆఫర్ చేసినప్పటికీ నిర్మాత రామ్ చరణ్ ఒప్పుకోలేదు. నిర్మాతల మండలి విధించిన నిబంధన ప్రకారం 7 వారాల తర్వాత స్ట్రీమింగ్ కు అనుమతి ఇస్తూ ఒప్పందం చేసుకుంది.

ఒప్పందం ప్రకారం.. విడుదలైన 51వ రోజు, అంటే రేపట్నుంచి సైరా సినిమా అమెజాన్ లో అందుబాటులోకి రాబోతోంది. సౌత్ లోని అన్ని భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. హిందీ వెర్షన్ ను మాత్రం మరో వారం రోజు తరువాత అప్ లోడ్ చేస్తారు.