భారత హాకీ శిబిరంలో కమల్ హాసన్ సందడి

  • భువనేశ్వర్ లో గౌరవడాక్టరేట్ అందుకొన్న నాయకుడు

విలక్షణ నటుడు, తమిళనాట ప్రముఖ రాజకీయనాయకుడు కమల్ హాసన్…భువనేశ్వర్ లో ఒరిస్సా ప్రభుత్వ గౌరవ డాక్టరేట్ అందుకొన్నారు. అంతేకాదు.. కళింగ స్టేడియంలో సాధన చేస్తున్న భారతజట్టు సభ్యులను కలసి..వారిలో స్ఫూర్తిని నింపారు.

భారత కెప్టెన్ మన్ దీప్ సింగ్, మాజీ కెప్టెన్ శ్రీజేశ్ లతో కలసి సెల్ఫీలు దిగారు. ఇతర ఆటగాళ్లతో కలసి ఫోటోలు దిగారు. శిక్షణ శిబిరంలో భారత ఆటగాళ్ల కఠోర సాధనను కమల్ హాసన్ స్వయంగా చూసి పులకించిపోయారు.

దేశం కోసం స్వేదాన్ని చిందిస్తున్న ఆటగాళ్లను కమల్ హాసన్ అభినందించారు. ఒడిషా ఎఫ్ సీ టీమ్, భారతజట్టు సభ్యులు కలసి కళింగ స్టేడియంలో నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ శిబిరంలో సంయుక్తంగా సాధన చేస్తున్నారు.

ఒడిషా ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం మేర భువనేశ్వర్ పర్యటనకు వచ్చిన కమల్ హాసన్..డాక్టర్ కమల్ హాసన్ గా స్వరాష్ట్ర్రానికి తిరిగి వెళ్లారు.