ప్రభుదేవా వాడకం ఇలా ఉంటుంది మరి…

పోకిరి సినిమా చెప్పగానే ఎవరికైనా మహేష్ బాబు గుర్తొస్తాడు. ఆ వెంటనే ప్రభుదేవా కూడా గుర్తుకొస్తాడు. ఈ సినిమాకు ప్రభుదేవాకు ఎలాంటి సంబంధం లేకపోయినా, పోకిరి సినిమాను ప్రభుదేవా వాడినట్టు ఇంకెవరు వాడలేదనేది మాత్రం అక్షర సత్యం.

పోకిరి సినిమాను హిందీలో రీమేక్ చేశాడు ప్రభుదేవా. సల్మాన్ హీరోగా రీమేక్ చేసి హిట్ కొట్టాడు. తమిళ్ లో విజయ్ హీరోగా రీమేక్ చేసి హిట్ కొట్టాడు. ఈ రెండు హిట్స్ తో బాగానే పేరు, డబ్బు సంపాదించుకున్నాడు. ఇప్పుడీ సినిమాలో హీరో పాత్రను కూడా వదల్లేదు ప్రభుదేవా.

తమిళ్ లో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభుదేవా. దీన్ని తెలుగులో కృష్ణ మనోహర్ పేరుతో విడుదల చేస్తున్నారు. కృష్ణమనోహర్ అనేది పోకిరిలో మహేష్ బాబు పాత్ర పేరు. ఇలా పోకిరి సినిమాలో మహేష్ పాత్ర పేరును కూడా వాడేస్తున్నాడు ప్రభుదేవా. అన్నట్టు కృష్ణమనోహర్ సినిమాలో పోలీస్ గా కనిపించబోతున్నాడు ఈ నటుడు కమ్ డైరక్టర్ కమ్ కొరియోగ్రాఫర్.