మిత్రన్ దర్శకత్వంలో అఖిల్…. హిట్స్-ఫ్లాప్స్ తో సంబంధం లేదట !

సినిమాకు సినిమాకు మధ్య చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు అఖిల్. ప్రతి సినిమా ఫ్లాప్ అవ్వడంతో అతడికి ఈ పరిస్థితి దాపురిస్తోంది. అయితే ఇలా చేయడం వల్ల ప్రేక్షకులకు దూరమైపోతున్నాడు ఈ అక్కినేని హీరో. అందుకే ఇకపై హిట్స్-ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా..గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇందులో భాగంగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడు.

ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమా సెట్స్ పై ఉంటుండగానే మరో సినిమాకు ఓకే చెప్పే ఆలోచనలో ఉన్నాడు. తమిళ దర్శకుడు పీఎస్ మిత్రన్ డైరక్షన్ లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట ఈ హీరో. బొమ్మరిల్లు భాస్కర్ సినిమా కంప్లీట్ అయిన వెంటనే మిత్రన్ సినిమా ఉంటుందంట. విశాల్ హీరోగా అభిమన్యుడు అనే సినిమాను తెరకెక్కించింది ఇతడే.

ఇకపై కనీసం ఏడాదికి రెండు సినిమాలైనా చేయాలని అనుకుంటున్నాడు అఖిల్. ఒకప్పటిలా ఫెయిల్యూర్ రాగానే ఇంట్లో ఉండిపోకుండా… వెంటవెంటనే కొత్త సినిమాల్ని సెట్స్ పైకి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడట. రాటుదేలడం అంటే ఇదేనేమో.