మెగా హీరో అస్సలు గ్యాప్ ఇవ్వట్లేదుగా!

చిత్రలహరి సక్సెస్ సాయితేజ్ కు ఎంత ఉత్సాహం ఇచ్చిందో ఇప్పుడిప్పుడే అర్థమౌతోంది. కొన్నాళ్ల పాటు ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేసిన సాయితేజ్, ఆ తర్వాత ఇక గ్యాప్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ హీరో, ఇప్పుడు మరో సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు.

మారుతి దర్శకత్వంలో ప్రతి రోజూ పండగే సినిమాను ఇలా పూర్తిచేసి, అలా మరో సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు సాయితేజ్. ప్రతిరోజూ పండగే సినిమా షూటింగ్ మొన్ననే కంప్లీట్ అయింది. ఇంకా చెప్పాలంటే కాస్త ప్యాచ్ వర్క్ పెండింగ్ ఉంది. అంతలోనే నిన్నట్నుంచి కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు సాయితేజ్.

బీవీఎస్ఎన్ ప్రసాద్ బ్యానర్ పై సుబ్బు అనే కుర్రాడ్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సోలో బతుకే సో బెటర్’ అనే సినిమాను ఇంతకుముందే స్టార్ట్ చేశాడు సాయితేజ్. ఇప్పుడీ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. అంతేకాదు, రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. సమ్మర్ ఎట్రాక్షన్ గా మే 1న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ నభానటేష్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.