Telugu Global
NEWS

ఇక కార్మిక సంఘాలు లేని ఆర్టీసీ?

తెలంగాణ ఆర్టీసీలో 48 రోజుల నుంచి సాగుతున్న సమ్మెను కేసీఆర్ పరిష్కరించడం లేదు. హైకోర్టులోనూ చుక్కెదురైంది. దీంతో చేసేందేం లేక ఆర్టీసీ కార్మిక జేఏసీ నాయకులు చేతులెత్తేశారు. ఇక సమ్మె వల్ల సాధించేది ఏమీ లేదని నిర్ధారించుకున్న ఆర్టీసీ కార్మికులు, సంఘాలు సమ్మె విరమణకు రెడీ అయ్యాయి. భేషరతుగా ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరాయి. ఆర్టీసీ కార్మికులు కేసీఆర్ కంటే కూడా కార్మిక నాయకులనే ఎక్కువగా నమ్మారు. కానీ ఇప్పుడు వారినే విలన్ లుగా చూపిస్తున్న […]

ఇక కార్మిక సంఘాలు లేని ఆర్టీసీ?
X

తెలంగాణ ఆర్టీసీలో 48 రోజుల నుంచి సాగుతున్న సమ్మెను కేసీఆర్ పరిష్కరించడం లేదు. హైకోర్టులోనూ చుక్కెదురైంది. దీంతో చేసేందేం లేక ఆర్టీసీ కార్మిక జేఏసీ నాయకులు చేతులెత్తేశారు. ఇక సమ్మె వల్ల సాధించేది ఏమీ లేదని నిర్ధారించుకున్న ఆర్టీసీ కార్మికులు, సంఘాలు సమ్మె విరమణకు రెడీ అయ్యాయి. భేషరతుగా ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరాయి.

ఆర్టీసీ కార్మికులు కేసీఆర్ కంటే కూడా కార్మిక నాయకులనే ఎక్కువగా నమ్మారు. కానీ ఇప్పుడు వారినే విలన్ లుగా చూపిస్తున్న పరిస్థితి నెలకొందట.. 48 రోజుల పాటు సమ్మె చేసి సాధించిందేమిటని కార్మిక నేతలను ప్రశ్నించినట్టు తెలిసింది. ఇప్పుడు ఏ హామీతో సమ్మె విరమిస్తున్నారో చెప్పాలని పలువురు జేఏసీ నేతలను నిన్న సమావేశంలో నిలదీసినట్లు తెలిసింది.

సమ్మె సాగడంలో కీలక పాత్ర పోషించిన అశ్వత్థామ రెడ్డిని ఇప్పుడు కార్మికులు, ప్రభుత్వం కూడా లక్ష్యంగా చేసుకుంది. సమ్మె విరమించడానికి కారణం కార్మికులకు ఏం చెబుతారని.. దీనివల్ల ప్రభుత్వానికి సంఘాలు పలుచన అవుతాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇప్పుడు కార్మిక సంఘాలు సమ్మె విరమణకు ముందుకు వచ్చినా కేసీఆర్ మాత్రం స్పందించడం లేదు. పట్టుదలకు పోయిన కార్మిక సంఘాలు, కార్మికులను వదిలే సమస్యలేదన్నట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. ఒకవేళ తీసుకున్నా ఆర్టీసీలో సంఘాలు లేని కార్మిక నేతలు లేని వ్యవస్థను తీసుకొచ్చేందుకు నడుం బిగిస్తున్నట్టు సమాచారం.

ఇప్పటికే బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడే సంఘాలు లేని ఆర్టీసీ కావాలంటూ కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అశ్వత్థామరెడ్డి సహా కార్మిక నేతలకు ఇక భవిష్యత్తు ఉండదని స్పష్టమైంది.

సమ్మె విరమించి, విధుల్లో చేరే కార్మికులను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్న ప్రభుత్వం.. యూనియన్లతో సంబంధం లేదంటూ డిక్లరేషన్ తీసుకొనే విధుల్లోకి తీసుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్న కార్మిక సంఘాలకు చెక్ పడుతుంది.

First Published:  20 Nov 2019 11:52 PM GMT
Next Story