మళ్లీ పాత గూటికే చేరిన సుజీత్

యూవీ క్రియేషన్స్ బ్యానర్ ను సుజీత్ ను విడదీసి చూడలేం. అతడి కెరీర్ ఈ బ్యానర్ లోనే ప్రారంభమైంది. రెండో సినిమా కూడా ఇదే బ్యానర్ లో చేశాడు. ఇప్పుడు మూడో సినిమా కూడా ఇదే బ్యానర్ పై చేయబోతున్నాడు సుజీత్.

సాహో తర్వాత షార్ట్ గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు, హీరో శర్వానంద్ కు ఓ స్టోరీలైన్ వినిపించాడు. శర్వా దాదాపు ఓకే చెప్పాడు. ప్రాజెక్టు సెట్ అయితే, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పైనే ఈ సినిమా వచ్చే ఛాన్స్ ఉంది. అలా బ్యాక్ టు బ్యాక్ ఇదే బ్యానర్ లో వర్క్ చేస్తున్నాడు సుజీత్.

రన్ రాజా రన్ సినిమాతో సుజీత్ టాలెంట్ తెలుసుకున్నాడు శర్వానంద్. అతడితో మరో సినిమా చేస్తానని అప్పుడే మాటిచ్చాడు. కాకపోతే సాహో కోసం లాంగ్ గ్యాప్ తీసుకోవడంతో ప్రాజెక్టు సెట్ అవ్వలేదు. మళ్లీ ఇన్నాళ్లకు రన్ రాజా రన్ కాంబినేషన్ రిపీట్ అవ్వబోతోంది. ఈసారి సుజీత్ ఎలాంటి స్టోరీలైన్ తీసుకుంటాడో చూడాలి.