Telugu Global
Cinema & Entertainment

'జార్జ్ రెడ్డి' సినిమా రివ్యూ

రివ్యూ : జార్జ్ రెడ్డి రేటింగ్ : 2.25/5 తారాగణం : సందీప్ మాధవ్, శ్రీనివాస్ పోకెల, సత్యదేవ్, దేవిక, ముస్కాన్ ఖుబ్చాందీని, పవన్ రమేష్, మనోజ్ నందం, అభయ్ బేతిగంటి తదితరులు సంగీతం: సురేష్ బొబ్బిలి నిర్మాత : అప్పి రెడ్డి, సంజయ్ రెడ్డి, దాము రెడ్డి, సుధాకర్ రెడ్డి ఎక్కంటి దర్శకత్వం : బి. జీవన్ రెడ్డి 1960లలో ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ గా ఉన్న జార్జ్ రెడ్డి అప్పటి విద్యార్థులకు ఆదర్శం. అప్పుడు జరుగుతున్న సామాజిక వివక్ష […]

జార్జ్ రెడ్డి సినిమా రివ్యూ
X

రివ్యూ : జార్జ్ రెడ్డి
రేటింగ్ : 2.25/5
తారాగణం : సందీప్ మాధవ్, శ్రీనివాస్ పోకెల, సత్యదేవ్, దేవిక, ముస్కాన్ ఖుబ్చాందీని, పవన్ రమేష్, మనోజ్ నందం, అభయ్ బేతిగంటి తదితరులు
సంగీతం: సురేష్ బొబ్బిలి
నిర్మాత : అప్పి రెడ్డి, సంజయ్ రెడ్డి, దాము రెడ్డి, సుధాకర్ రెడ్డి ఎక్కంటి
దర్శకత్వం : బి. జీవన్ రెడ్డి

1960లలో ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ గా ఉన్న జార్జ్ రెడ్డి అప్పటి విద్యార్థులకు ఆదర్శం. అప్పుడు జరుగుతున్న సామాజిక వివక్ష పై మొట్టమొదటి సారిగా నోరు విప్పిన గొప్ప స్టూడెంట్ లీడర్ జార్జ్ రెడ్డి.

ఇప్పుడు అతని జీవితం ఆధారంగా ‘జార్జ్ రెడ్డి’ అనే బయోపిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘వంగవీటి’ సినిమా లో నటించిన సందీప్ మాధవ్ ఈ సినిమాలో జార్జ్ రెడ్డి పాత్రను పోషించారు. బి జీవన్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

టీజర్ మరియు ట్రైలర్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ముస్కాన్… అమెరికాలో ఉండే ఒక ఫిలిం మేకింగ్ స్టూడెంట్. ఆమె జార్జ్ రెడ్డి జీవితంపై సినిమా తీయాలన్న ఆలోచనతో తిరిగి ఇండియాకి వస్తుంది. ఇక్కడ జార్జ్ రెడ్డి కి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇలా జార్జ్ రెడ్డి గురించి వివరాలు సేకరిస్తూ ఉంటుంది. అసలు జార్జ్ రెడ్డి ఎవరు? అతని జీవితంలో ఏం జరిగింది? అతన్ని ఎవరు చంపారు? అనే విషయాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతూ ఉంటుంది.

సందీప్ మాధవ్ నటన ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. జార్జ్ రెడ్డి పాత్రలో ఒదిగిపోయి… సందీప్ ఈ సినిమాలో చాలా బాగా నటించాడు. చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ జార్జ్ రెడ్డి పాత్రలో మరియు తన నటనలోను పరిణితి కనబరిచాడు సందీప్ మాధవ్.

శ్రీనివాస్ పోకెల నటన కూడా సినిమాకి చాలా బాగా ప్లస్ అయింది. ఈ సినిమాలో తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు సత్యదేవ్. తన పాత్ర మరియు తన నటనతో కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తాడు సత్యదేవ్.

జార్జ్ రెడ్డి తల్లి పాత్రలో దేవిక చాలా బాగా నటించింది. ముస్కాన్ నటన కూడా చాలా బాగుంది. పవన్ రమేష్ చాలా సహజంగా నటించాడు. మనోజ్ నందం నటన కూడా సినిమాకి బాగా ప్లస్ అయింది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

బయోపిక్ కాబట్టి దర్శకుడు జీవన్ రెడ్డి…. జార్జిరెడ్డి జీవితంలోని ముఖ్య ఘట్టాలను చాలా బాగా తెరకెక్కించాడు. జార్జిరెడ్డి బాల్యం నుంచి ఆఖరి వరకు అతని జీవితాన్ని తెరపై చాలా బాగా చూపించాడు.

కథను బాగానే హ్యాండిల్ చేసినప్పటికీ… నెరేషన్ మాత్రం బాగా స్లోగా ఉండడంతో ప్రేక్షకులకు కొంచెం బోర్ అనిపిస్తుంది. అయితే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలలో… ముఖ్యంగా ఫైట్ సన్నివేశాలను దర్శకుడు జీవన్ రెడ్డి చాలా బాగా చూపించాడు.

నిర్మాణ విలువలు ఈ సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం కూడా సినిమాకి చాలా బాగా వర్కౌట్ అయింది. చాలా సన్నివేశాల్లో అతను అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. సినిమాటోగ్రాఫర్ సుధాకర్ రెడ్డి ఈ సినిమాకు మంచి విజువల్స్ ను అందించాడు. ఎడిటింగ్ పర్వాలేదు అనిపిస్తుంది.

బలాలు:

నటీనటులు, నేపధ్య సంగీతం, యాక్షన్ సన్నివేశాలు

బలహీనతలు:

స్లో నెరేషన్, సాగతీత సన్నివేశాలు

చివరి మాట:

సినిమా మొదటి పావుగంట ఆసక్తికరంగానే నడుస్తుంది… కానీ ఆతరువాత కథ బాగా స్లోగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. జార్జ్ రెడ్డి జీవితంలోని ముఖ్య అంశాలను తెరపై చూపించిన విధానం బాగానే ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే బాగా స్లో గా సాగుతూ ఉండటంతో ప్రేక్షకులకు కొంత బోర్ కొడుతుంది.

ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సందీప్ మాధవ్ కనబరిచిన అద్భుతమైన నటన గురించి. జార్జ్ రెడ్డి పాత్రలో ఒదిగిపోయి సందీప్ మాధవ్ సినిమాను తన నటనతో ముందుకు నడిపాడు. యాక్షన్ సన్నివేశాల్లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి బాగా హెల్ప్ అయింది.

అయితే స్క్రీన్ ప్లే మరికొంత ఫాస్ట్ గా ఉండి ఉంటే సినిమా మరింత బాగుండేది. చివరిగా ‘జార్జ్ రెడ్డి’ సినిమా కొంచెం స్లోగా సాగే ఒక మంచి బయోపిక్.

బాటమ్ లైన్:

‘జార్జ్ రెడ్డి’ యువత బాగా కనెక్ట్ అయ్యే ఒక బయోపిక్

First Published:  22 Nov 2019 11:00 AM GMT
Next Story