కమ్మవాళ్లంతా నీ వద్ద క్యాస్ట్ సర్టిఫికేట్‌ తీసుకోవాలా… ఒక్కసారైనా తిరుమలలో గుండు కొట్టించుకున్నావా బాబు ?

టీడీపీ నేతలు తనపై చేస్తున్న విమర్శలకు మంత్రి కొడాలి నాని గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తాను తిరుమల వెళ్లిన ప్రతిసారీ తలనీలాలు సమర్పిస్తుంటానని… చంద్రబాబు ఒక్కసారైనా తిరుమలలో తలనీలాలు సమర్పించారా అని ప్రశ్నించారు.

తిరుమల వెళ్లాలంటే టీడీపీ, బీజేపీ సభ్యత్వం ఉండాలి అన్నట్టుగా వీరి తీరు తయారైందన్నారు. కమ్మవాళ్లంతా తన వద్ద కమ్మకులం క్యాస్ట్ సర్టిఫికేట్‌ తీసుకుని వెళ్లాలి అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని కొడాలి నాని ఫైర్ అయ్యారు. తాను ఇప్పటి వరకు 40 సార్లు తిరుమల వెళ్లాలని… తన పేరు కొడాలి వెంకటేశ్వరరావు అని చెప్పారు.

మద్యం ధరలను తిరుమల లడ్డూతో పోల్చే దౌర్భాగ్య స్థితికి చంద్రబాబు దిగజారిపోయారన్నారు. చంద్రబాబు వద్ద ఆంబోతుల్లాంటి పెయిడ్ ఆర్టిస్టులకు కొదవ లేకుండాపోయిందన్నారు. 5వేల రూపాయలకు ప్రెస్‌మీట్లు పెట్టే సన్నాసులు కూడా జగన్‌ను విమర్శిస్తున్నారని పైర్ అయ్యారు.

దేవుడిని కూడా రాజకీయ కోణంలో చూసే వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. ప్రజలు పాతాళంలోకి తొక్కేసినా చంద్రబాబుకి బుద్ది రాలేదన్నారు. రాజకీయాల్లోకి రావడం కోసం సొంత వదిననే చంపేసిన వ్యక్తి దేవినేని ఉమా అని ఆరోపించారు. దేవినేని ఉమా మంత్రిగా కంటే సూట్‌కేసులు మోసే బ్రోకర్‌గానే పనిచేశారన్నారు. కాంట్రాక్టర్ల వద్ద డబ్బు వసూలు చేసి తీసుకొచ్చి చంద్రబాబు, పప్పునాయుడికి ఇచ్చేవాడన్నారు.

అసెంబ్లీ వేదికగా బోండా ఉమా తనను పాతేస్తా అన్నప్పుడు చంద్రబాబు ఏమైపోయారని ప్రశ్నించారు. ఇసుక కొరత వల్లే స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకున్నారని లోకేష్ చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. కొన్ని రోజులు ఆగితే కోడెల శివప్రసాదరావు కూడా ఇసుక కొరత వల్లే చనిపోయాడని చెప్పేలా ఉన్నారన్నారు. నారా లోకేష్ టీడీపీని ఇసుకలో పాతేసి ఆ పార్టీకి రాజకీయ సమాధి కడతాడని కొడాలి నాని జోస్యం చెప్పారు.