Telugu Global
Cinema & Entertainment

రవితేజ మొదలుపెట్టాడు

రీసెంట్ గా క్రాక్ అనే సినిమా స్టార్ట్ చేశాడు రవితేజ. ఠాగూర్ మధు నిర్మాతగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రావాల్సిన సినిమా అది. ప్రస్తుతం చేస్తున్న డిస్కోరాజా మూవీ కంప్లీట్ అయిన తర్వాత క్రాక్ మొదలవుతుందని అంతా భావించారు. కానీ డిస్కోరాజా సెట్స్ పై ఉంటుండగానే క్రాక్ ను స్టార్ట్ చేశాడు రవితేజ. రామోజీ ఫిలింసిటీలో నిన్నట్నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. డిస్కోరాజా సినిమాకు సంబంధించి ఓ సాంగ్ తో పాటు ప్యాచ్ వర్క్ […]

రవితేజ మొదలుపెట్టాడు
X

రీసెంట్ గా క్రాక్ అనే సినిమా స్టార్ట్ చేశాడు రవితేజ. ఠాగూర్ మధు నిర్మాతగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రావాల్సిన సినిమా అది. ప్రస్తుతం చేస్తున్న డిస్కోరాజా మూవీ కంప్లీట్ అయిన తర్వాత క్రాక్ మొదలవుతుందని అంతా భావించారు. కానీ డిస్కోరాజా సెట్స్ పై ఉంటుండగానే క్రాక్ ను స్టార్ట్ చేశాడు రవితేజ. రామోజీ ఫిలింసిటీలో నిన్నట్నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.

డిస్కోరాజా సినిమాకు సంబంధించి ఓ సాంగ్ తో పాటు ప్యాచ్ వర్క్ పెండింగ్ లో ఉంది. ఓవైపు ఇది పూర్తిచేస్తూనే, మరోవైపు క్రాక్ ను స్టార్ట్ చేశాడు రవితేజ. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైన శృతిహాసన్ మాత్రం ఇంకా సెట్స్ పైకి రాలేదు. ఆమె డిసెంబర్ మొదటి వారంలో క్రాక్ కు కాల్షీట్లు కేటాయించినట్టు తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా క్రాక్ సినిమా తెరకెక్కుతోంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

తమిళనటులు వరలక్ష్మి, సముత్తరఖని ఈ సినిమాలో రెండు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా క్రాక్ ను థియేటర్లలోకి తీసుకొస్తారు.

First Published:  22 Nov 2019 3:00 AM GMT
Next Story