Telugu Global
Cinema & Entertainment

మహేష్ సినిమాలో యూపీ బ్యాక్ డ్రాప్

మహేష్, అనీల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాలో యాక్షన్ తో పాటు మంచి కామెడీ ఉండబోతోందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు మరో ఎలిమెంట్ బయటకొచ్చింది. ఈ రెండు అంశాలతో పాటు మహేష్ మూవీలో బలమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఉందట. ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కోణంలో బలమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు, మహేష్ […]

మహేష్ సినిమాలో యూపీ బ్యాక్ డ్రాప్
X

మహేష్, అనీల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాలో యాక్షన్ తో పాటు మంచి కామెడీ ఉండబోతోందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు మరో ఎలిమెంట్ బయటకొచ్చింది. ఈ రెండు అంశాలతో పాటు మహేష్ మూవీలో బలమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఉందట.

ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కోణంలో బలమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు, మహేష్ మిలట్రీ గెటప్ కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లోనే వస్తుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ ఫ్లాష్ బ్యాక్ మొత్తం ఉత్తరప్రదేశ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట. ఈ సినిమాలో భారతి అనే క్యారెక్టర్ లో కనిపించనుంది విజయశాంతి.

సినిమాకు సంబంధించి ఈరోజు టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. సాయంత్రం సరిగ్గా 5 గంటల 4 నిమిషాలకు టీజర్ రాబోతోంది. టీజర్ లో ఫ్లాష్ బ్యాక్ కు సంబంధించి సీన్స్ కొన్ని పెట్టారు. నిమిషం కంటే ఎక్కువ నిడివితో రాబోతున్న ఈ టీజర్ కోసం అటు ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ మొత్తం వెయిట్ చేస్తోంది.

First Published:  22 Nov 2019 12:09 AM GMT
Next Story