Telugu Global
CRIME

2 కోట్లు... 40 బంగారు బిస్కెట్లు ప‌ట్టివేత !

హైద‌రాబాద్‌లో భారీగా బంగారం, న‌గ‌దు దొరికింది. డైరెక్ట‌రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల నిఘాలో ఈ బంగారం ప‌ట్టుబ‌డింది. సికింద్రాబాద్‌ ఈస్ట్ మారేడ్ పల్లిలోని షెనాయ్ హాస్పిటల్స్ ద‌గ్గ‌ర‌లో ఉన్న ఓ ఇంటినుండి 4 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిఘావ‌ర్గాలకు అందిన స‌మాచారం మేర‌కు ఇంటిపై దాడులు చేస్తే భారీగా బంగారం ప‌ట్టుబడింది. ఇంటి పార్కింగ్ ప్లేస్‌లోని కారులో బంగారం బ్యాగును అధికారులు గుర్తించారు. ఆ బ్యాగుని తెరిచి చూస్తే 40 బంగారు బిస్కెట్లు కనిపించాయి. వీటి […]

2 కోట్లు... 40 బంగారు బిస్కెట్లు ప‌ట్టివేత !
X

హైద‌రాబాద్‌లో భారీగా బంగారం, న‌గ‌దు దొరికింది. డైరెక్ట‌రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల నిఘాలో ఈ బంగారం ప‌ట్టుబ‌డింది. సికింద్రాబాద్‌ ఈస్ట్ మారేడ్ పల్లిలోని షెనాయ్ హాస్పిటల్స్ ద‌గ్గ‌ర‌లో ఉన్న ఓ ఇంటినుండి 4 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిఘావ‌ర్గాలకు అందిన స‌మాచారం మేర‌కు ఇంటిపై దాడులు చేస్తే భారీగా బంగారం ప‌ట్టుబడింది.

ఇంటి పార్కింగ్ ప్లేస్‌లోని కారులో బంగారం బ్యాగును అధికారులు గుర్తించారు. ఆ బ్యాగుని తెరిచి చూస్తే 40 బంగారు బిస్కెట్లు కనిపించాయి. వీటి బరువు 4 కిలోలుగా అధికారులు లెక్క తేల్చారు. బంగారంతో పాటు రెండు కోట్ల రూపాయల విలువైన బంగారం అమ్మకాలకు సంబంధించిన పత్రాలని, నగదుని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా వీటి విలువ 4 కోట్ల రూపాయలని డిఆర్ఐ అధికారులు ప్రకటించారు.

కాలికట్ నుండి ఈ బంగారాన్ని స్మగ్లింగ్ చేశారని డిఆర్ఐ అధికారులు గుర్తించారు. ఇతర దేశాలనుండి దొంగతనంగా బంగారం తెచ్చామని ముగ్గురు నిందితులు అంగీకరించార‌ని డిఆర్ఐ అధికారులు వివరించారు. ఈ ముగ్గురే ముఠాలో ఉన్నారా? లేక వీరికి ఎవరెవరు స‌హ‌క‌రించారనే కోణంలో విచార‌ణ జ‌రుపుతున్నారు.

First Published:  23 Nov 2019 10:45 PM GMT
Next Story