Telugu Global
Cinema & Entertainment

ఆర్-ఆర్-ఆర్ అప్ డేట్స్

ఎప్పుడైతే సినిమాలో మూడు పాత్రల్ని ఒకేసారి రివీల్ చేసి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారో, అప్పట్నుంచి RRR సినిమాకు సంబంధించి బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా షూటింగ్ కు సంబంధించి మరో అప్ డేట్ విడుదల చేసింది యూనిట్. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో ఓ సాంగ్ ను షూట్ చేస్తున్నట్టు ప్రకటించింది. రామ్ చరణ్, అలియా భట్ కాంబినేషన్ లో ఫిలింసిటీలో ఈ సాంగ్ షూట్ జరుగుతోంది. దీని […]

ఆర్-ఆర్-ఆర్ అప్ డేట్స్
X

ఎప్పుడైతే సినిమాలో మూడు పాత్రల్ని ఒకేసారి రివీల్ చేసి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారో, అప్పట్నుంచి RRR సినిమాకు సంబంధించి బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా షూటింగ్ కు సంబంధించి మరో అప్ డేట్ విడుదల చేసింది యూనిట్. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో ఓ సాంగ్ ను షూట్ చేస్తున్నట్టు ప్రకటించింది.

రామ్ చరణ్, అలియా భట్ కాంబినేషన్ లో ఫిలింసిటీలో ఈ సాంగ్ షూట్ జరుగుతోంది. దీని కోసం భారీ సెట్ వేశారు. ఈ ఒక్క సెట్ కోసమే దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, మరోవైపు ఎన్టీఆర్ తో నానక్ రామ్ గూడలో వేసిన మరో సెట్ లో కూడా షూటింగ్ చేస్తున్నారు. సాంగ్ షూటింగ్ ను అసిస్టెంట్ డైరక్టర్లకు అప్పగించిన రాజమౌళి, తను మాత్రం ఎన్టీఆర్ తో షూట్ చేసే సన్నివేశాల్ని డైరక్ట్ చేస్తున్నాడు.

ఇలా గ్యాప్ లేకుండా ఆర్-ఆర్-ఆర్ సినిమాను షూట్ చేసి, అనుకున్న డెడ్ లైన్ ను చేరుకోవాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు జక్కన్న. ఈ సినిమాను వచ్చే ఏడాది జులై 30న విడుదల చేయబోతున్నట్టు ఏడాది కిందటే ప్రకటించారు. కానీ ఆ టైమ్ కు సినిమా వచ్చేది అనుమానమే అంటూ కథనాలు వస్తున్నాయి. వీటికి చెక్ పెట్టేవిధంగా షూటింగ్ ను పరుగులుపెట్టిస్తున్నాడు రాజమౌళి.

దాదాపు 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్-ఆర్-ఆర్ సినిమాను ఒకేసారి 10 భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే 70శాతం షూటింగ్ పూర్తయినట్టు ప్రకటించిన యూనిట్.. జనవరి నాటికి 90శాతం షూటింగ్ పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

First Published:  24 Nov 2019 5:00 AM GMT
Next Story