Telugu Global
Cinema & Entertainment

సరిలేరు టీజర్.... స్పైడర్ తో పోలిక

మహేష్ హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు టీజర్ సోషల్ మీడియాను రఫ్ఫాడిస్తోంది. కేవలం 24 గంటల్లో ఏకంగా 18 మిలియన్ వ్యూస్ వచ్చాయి ఈ టీజర్ కు. అయితే ఓవైపు ఈ టీజర్ ను ఎంత లైక్ చేస్తున్నారో, మరోవైపు ఈ టీజర్ పై కామెంట్స్ కూడా అదే రేంజ్ లో పడుతున్నాయి. మరీ ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో విమర్శలు తప్పలేదు. సరిలేరు నీకెవ్వరు టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్, స్పైడర్ సినిమా […]

సరిలేరు టీజర్.... స్పైడర్ తో పోలిక
X

మహేష్ హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు టీజర్ సోషల్ మీడియాను రఫ్ఫాడిస్తోంది. కేవలం 24 గంటల్లో ఏకంగా 18 మిలియన్ వ్యూస్ వచ్చాయి ఈ టీజర్ కు. అయితే ఓవైపు ఈ టీజర్ ను ఎంత లైక్ చేస్తున్నారో, మరోవైపు ఈ టీజర్ పై కామెంట్స్ కూడా అదే రేంజ్ లో పడుతున్నాయి. మరీ ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో విమర్శలు తప్పలేదు.

సరిలేరు నీకెవ్వరు టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్, స్పైడర్ సినిమా నేపథ్య సంగీతానికి దగ్గరగా ఉందనేది ప్రధానమైన ఫిర్యాదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో తనదైన ముద్రవేసిన దేవిశ్రీప్రసాద్, సరిలేరు సినిమాకు ఇలా కాపీ ట్యూన్స్ ఫాలో అవ్వడం ఏంటనేది నెటిజన్ల ప్రశ్న. మరీ ముఖ్యంగా స్పైడర్ లాంటి డిజాస్టర్ సినిమా స్కోర్ ను డీఎస్పీ ఫాలో అవ్వడాన్ని చాలామంది అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీజర్ వరకు అయిందేదో అయిపోయింది, కనీసం సినిమాలోనైనా ఆ స్కోర్ లేకుండా చూసుకోవాలని చాలామంది దేవిశ్రీకి సలహాలిస్తున్నారు.

ఇప్పటికే దేవిశ్రీప్రసాద్ పై చాలా వత్తిడి ఉంది. ఓవైపు సరిలేరు సినిమాకు పోటీగా వస్తున్న అల వైకుంఠపురములో సాంగ్స్ సూపర్ హిట్ అవుతున్నాయి. తాజాగా వచ్చిన ఓ మై గాడ్ డాడీ సాంగ్ కూడా హిట్ అయింది.

ఈ నేపథ్యంలో.. సరిలేరు నీకెవ్వరు సినిమా సాంగ్స్ కూడా కచ్చితంగా హిట్ అవ్వాలి. లేదంటే తమన్ కంటే వెనకబడిపోతాడు దేవిశ్రీ. ఇలాంటి కీలకమైన టైమ్ లో కాపీ ట్యూన్స్ కొట్టడంతో దేవిశ్రీపై మరింత ఒత్తిడి పెరిగింది.

First Published:  24 Nov 2019 7:00 AM GMT
Next Story