Telugu Global
NEWS

హాటు హాటుగా హైదరాబాద్ క్రికెట్

కెటీఆర్ కు రాయుడి ట్వీట్ తో అజర్ గరంగరం హైదరాబాద్ క్రికెట్ ను కాపాడాలంటూ రాయుడి మొర అవినీతి కూపంలో కూరుకుపోయి…భ్రష్టు పట్టిన హైదరాబాద్ క్రికెట్ ను ప్రక్షాళన చేయాలంటూ కెప్టెన్ అంబటి రాయుడు మొరపెట్టుకొన్నాడు. ఘనమైన ఘనత, వారసత్వం కలిగిన హైదరాబాద్ క్రికెట్ ను పరిరక్షించాలని, భావితరాలకు మార్గదర్శకులుగా నిలవాలంటూ అంబటి రాయుడు… రాష్ట్ర్రమంత్రి కెటీ రామారావుకు ట్వీట్ చేయడం వివాదాస్పదంగా మారింది. జైసింహా, మన్సూర్ అలీఖాన్ పటౌడీ, జయంతిలాల్, అజర్, వీవీఎస్ లక్ష్మణ్, శివలాల్ యాదవ్,వెంకటపతి […]

హాటు హాటుగా హైదరాబాద్ క్రికెట్
X
  • కెటీఆర్ కు రాయుడి ట్వీట్ తో అజర్ గరంగరం
  • హైదరాబాద్ క్రికెట్ ను కాపాడాలంటూ రాయుడి మొర

అవినీతి కూపంలో కూరుకుపోయి…భ్రష్టు పట్టిన హైదరాబాద్ క్రికెట్ ను ప్రక్షాళన చేయాలంటూ కెప్టెన్ అంబటి రాయుడు మొరపెట్టుకొన్నాడు. ఘనమైన ఘనత, వారసత్వం కలిగిన హైదరాబాద్ క్రికెట్ ను పరిరక్షించాలని, భావితరాలకు మార్గదర్శకులుగా నిలవాలంటూ అంబటి రాయుడు… రాష్ట్ర్రమంత్రి కెటీ రామారావుకు ట్వీట్ చేయడం
వివాదాస్పదంగా మారింది.

జైసింహా, మన్సూర్ అలీఖాన్ పటౌడీ, జయంతిలాల్, అజర్, వీవీఎస్ లక్ష్మణ్, శివలాల్ యాదవ్,వెంకటపతి రాజు , అబీద్ అలీ లాంటి ఎందరో గొప్పగొప్ప టెస్ట్ క్రికెటర్లను అందించిన ఘనత హైదరాబాద్ కు ఉందని…అలాంటి ఘనవారసత్వం కలిగిన హైదరాబాద్ క్రికెట్ అవినీతి పరులు, స్వార్థపరుల చేతుల్లో పడి దారి తప్పిందంటూ..హైదరాబాద్ క్రికెట్ సంఘం గౌరవాధ్యక్షుడు కెటీఆర్ కు ట్విటర్ ద్వారా కెప్టెన్ అంబటి రాయుడు మొరపెట్టుకొన్నాడు. భావితరాల కోసం హైదరాబాద్ క్రికెట్ ను కాపాడాలని, ప్రక్షాళన చేయాలని సూచించాడు.

రాయుడు ఓ విఫల క్రికెటర్…

మంత్రి కేటీఆర్ కు రాయుడు ట్వీట్ చేయటం…హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు మహ్మద్ అజరుద్దీన్ కు కోపం తెప్పించింది. రాయుడు దారితప్పిన ఓ విఫల క్రికెటర్ అంటూ అజర్ వ్యాఖ్యానించాడు. వ్యక్తిగతంగా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి రాయుడు హైదరాబాద్ క్రికెట్ సంఘం పై ఆరోపణలు చేస్తున్నాడంటూ ప్రతిస్పందించాడు.

అయితే…రాయుడు మాత్రం…తన ఆవేదనను అర్థం చేసుకోవాలని, వ్యక్తిగతంగా చూడకుండా హైదరాబాద్ క్రికెట్ ను అవినీతిపరులు, సొంత ప్రయోజనాలకు వాడుకొనేవారి నుంచి కాపాడాలని అజర్ కు సూచించాడు. హైదరాబాద్ క్రికెట్ ను భ్రష్టు పట్టించినవారి మాయమాటల్లో అజర్ పడకుండా ఉండాలంటూ వేడుకొన్నాడు.

అజర్ తనకుతానుగా నిర్ణయాలు తీసుకొంటూ దారితప్పిన హైదరాబాద్ క్రికెట్ ను గాడిలో పెట్టాలని, భావితరాల కోసం గట్టి పునాది వేయాలంటూ విజ్ఞప్తి చేశాడు.

ఇంగ్లండ్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్ లో పాల్గొనే అవకాశం చేజారిపోడంతో అర్థంతరంగా రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడు… ఆ తర్వాత లక్ష్మణ్ లాంటి అనుభవజ్ఞుల సూచనతో తిరిగి రిటైర్మెంట్ నుంచి బయటకు వచ్చి…హైదరాబాద్ క్రికెట్ జట్టు పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే.

First Published:  25 Nov 2019 11:00 AM GMT
Next Story