Telugu Global
NEWS

పాక్ టెస్ట్ జట్టులో 16 ఏళ్ల ఫాస్ట్ బౌలర్

బ్రిస్బేన్ టెస్టులో నసీమ్ షాకు టెస్ట్ క్యాప్ నసీమ్ వయసుపై వివాదం ఆస్ట్ర్రేలియాతో బ్రస్బేన్ గబ్బా వేదికగా ముగిసిన తొలి టెస్ట్ మ్యాచ్ ద్వారా పాకిస్థాన్ యువఫాస్ట్ బౌలర్ నసీమ్ షా టెస్ట్ క్యాప్ అందుకోడం ద్వారా వార్తల్లో నిలిచాడు. కేవలం 16 సంవత్సరాల చిరుప్రాయంలోనే టెస్ట్ క్యాప్ సాధించడమే కాదు..గంటకు సగటున 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే సత్తా ఉందని నిరూపించుకొన్నాడు. గతంలో ఇమ్రాన్ ఖాన్, సర్ ఫ్రాజ్ నవాజ్, ,షోయబ్ అక్తర్, వాసిం […]

పాక్ టెస్ట్ జట్టులో 16 ఏళ్ల ఫాస్ట్ బౌలర్
X
  • బ్రిస్బేన్ టెస్టులో నసీమ్ షాకు టెస్ట్ క్యాప్
  • నసీమ్ వయసుపై వివాదం

ఆస్ట్ర్రేలియాతో బ్రస్బేన్ గబ్బా వేదికగా ముగిసిన తొలి టెస్ట్ మ్యాచ్ ద్వారా పాకిస్థాన్ యువఫాస్ట్ బౌలర్ నసీమ్ షా టెస్ట్ క్యాప్ అందుకోడం ద్వారా వార్తల్లో నిలిచాడు.

కేవలం 16 సంవత్సరాల చిరుప్రాయంలోనే టెస్ట్ క్యాప్ సాధించడమే కాదు..గంటకు సగటున 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే సత్తా ఉందని నిరూపించుకొన్నాడు.

గతంలో ఇమ్రాన్ ఖాన్, సర్ ఫ్రాజ్ నవాజ్, ,షోయబ్ అక్తర్, వాసిం అక్రం, వకార్ యూనిస్ లాంటి ఎందరో గొప్ప గొప్ప ఫాస్ట్ బౌలర్లను అందించిన ఘనత పాక్ క్రికెట్ కు ఉంది.

అప్పుడు షోయబ్…ఇప్పుడు నసీమ్ షా

నిప్పులు చెరిగే ఫాస్ట్ బౌలర్లను అందించడం పాక్ క్రికెట్ కు ఓ ఆనవాయితీగా వస్తోంది. గతంలో షోయబ్ అక్తర్ ను ప్రపంచ మేటి ఫాస్ట్ బౌలర్ గా గుర్తించారు. గంటకు 100 మైళ్ల వేగంతో బౌల్ చేసిన మొనగాడిగా షోయబ్ అక్తర్ కు గుర్తింపు ఉంది.

తాజాగా షోయబ్ అక్తర్ వారసుడిగా 16 ఏళ్ల నసీమ్ షా తెరమీదకు వచ్చాడు. అండర్ -19 జూనియర్ ప్రపంచకప్ తో పాటు..దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించడం ద్వారా నసీమ్ షా…పాక్ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.

ఆస్ట్ర్రేలియాతో జరుగుతున్న ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ సిరీస్ కు ఎంపికైన పాక్ టెస్టుజట్టులో చోటు సాధించాడు. బ్రిస్బేన్ గబ్బా వేదికగా ముగిసిన తొలిమ్యాచ్ ద్వారా టెస్ట్ అరంగేట్రం చేశాడు.

మొత్తం 20 ఓవర్లు బౌల్ చేసిన నసీమ్ ఒక మేడిన్ తో 68 పరుగులిచ్చి ఓపెనర్ డేవిడ్‌ వార్నర్ వికెట్ పడగొట్టగలిగాడు.
నిజంగా…16 ఏళ్లేనా…. పాక్ యువఫాస్ట్ బౌలర్ నసీమ్ షా వయసు నిజంగా 16సంవత్సరాలేనా…చూస్తుంటే అలా ఏమాత్రం అనిపించడం లేదంటూ భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ట్వీట్ చేశాడు.

అయితే…పాక్ క్రికెట్ ప్రతినిధి మాత్రం..కైఫ్ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని,,నసీమ్ షా రికార్డులు చూస్తేనే తెలుస్తుందని వివరణ ఇచ్చాడు.

First Published:  25 Nov 2019 11:10 AM GMT
Next Story