రీయూనియ‌న్‌కు బాల‌య్య దూరం…. నాగ్ వ‌ల్లే రాలేదా?

ఎన‌భైల‌ నాటి హీరో హీరోయిన్ లు `క్లాస్ ఆఫ్ ఎయిటీస్` పేరుతో ప్ర‌తియేటా పార్టీ చేసుకుంటారు. గ‌తంలో రకరకాల ప్రదేశాల్లో ఈ మీటింగ్ పార్టీ చేసుకున్నారు. ఈసారి ప‌దో వార్షికోత్స‌వం హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేశారు.

హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని మెగాస్టార్ చిరంజీవి సొంత ఇంట్లో పార్టీ నిర్వ‌హించారు. ఈ రీయూనియ‌న్ మీట్ లో ఈసారి 1980-1990లో అగ్ర తార‌లు పాల్గొన్నారు. బాలీవుడ్, టాలీవుడ్ – కోలీవుడ్ స‌హా మ‌ల‌యాళం.. క‌న్న‌డం నుంచి మొత్తం 40 మంది తార‌లు ఈ వేడుక‌కు హాజ‌ర‌య్యారు.

ఇంత‌కుముందు ఈ పార్టీకి కొంద‌రు హీరోలు హాజ‌రు కాలేదు. వారిలో ఒక‌రు నాగార్జున‌. ఈ సారి అమ‌ల‌తో క‌లిసి నాగ్ ఈ పార్టీకి అటెండ్ అయ్యారు. వీరితో పాటు వెంక‌టేష్‌, సుమన్‌,జ‌గ‌ప‌తిబాబు,భానుచంద‌ర్‌తో పాటు శ‌ర‌త్ కుమార్‌,ప్ర‌భు వ‌చ్చారు. హీరోయిన్లు రాధిక‌,సుహాసిని,అమ‌ల‌, లిసాతో పాటు చాలా మంది వ‌చ్చారు. ప్ర‌తి ఏటా ఈ పార్టీ చేస్తున్నారు. గ‌త ఏడాది చైనాలో నిర్వ‌హించారు. ఈ సారి చిరు ఇంట్లో ఏర్పాటు చేశారు.

అయితే ఈ పార్టీలో హీరో బాల‌కృష్ణ క‌నిపించ‌లేదు. హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన పార్టీకి బాల‌య్య రాక‌పోవ‌డం హాట్ టాపిక్ అయింది. ప్ర‌స్తుతం రూలర్ సినిమాతో ఆయ‌న బిజీగా ఉన్నారు. డిసెంబ‌ర్ 20న విడుద‌ల తేదీని ప్రకటించడంతో…. షూటింగ్ బిజీ వ‌ల్ల పార్టీకి రాలేదా? లేక ఇత‌ర కార‌ణాలు ఉన్నాయా? అనేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

గ‌త ఏడాది జ‌రిగిన పార్టీకి బాల‌య్య అటెండ్ అయ్యారు. పుల్ ఎంజాయ్ చేశారు. అయితే ఈసారి రాక‌పోవ‌డానికి కార‌ణంపై మాత్రం టాలీవుడ్‌లో చ‌ర్చ జ‌రుగుతోంది. రీయూనియ‌న్ పార్టీకి గ‌తంలో నాగార్జున రాలేదు. కానీ ఈ సారి హైద‌రాబాద్‌లో నిర్వ‌హించ‌డంతో అమ‌ల‌తో క‌లిసి వ‌చ్చాడు. దీంతో ఈ విష‌యం తెలిసి బాల‌య్య రాలేద‌ని అంటున్నారు. అక్కినేని నాగార్జున‌తో బాల‌కృష్ణకు చాలా రోజులుగా గ్యాప్ ఉంది. నాగ్ వ‌ల్లే బాల‌య్య రాలేదా? లేక నిజంగానే షూటింగ్ ఉండి రాలేదా? అనే విష‌యం తెలియాల్సి ఉంది.