Telugu Global
NEWS

డేవిస్ కప్ విజేతగా స్పెయిన్

ఆరోసారి టైటిల్ నెగ్గిన నడాల్ ఆర్మీ ఫైనల్లో కెనడాపై స్పెయిన్ విజయం ప్రపంచ టెన్నిస్ పురుషుల టీమ్ చాంపియన్లకు ఇచ్చే డేవిస్ కప్ ను టాప్ ర్యాంకర్ రాఫెల్ నడాల్ నాయకత్వంలోని స్పెయిన్ జట్టు ఆరోసారి గెలుచుకొంది. మాడ్రిడ్ వేదికగా ముగిసిన 2019 సీజన్ డేవిస్ కప్ టైటిల్ సమరంలో నడాల్ తుదివరకూ పోరాడి తనజట్టుకు డేవిస్ కప్ విజయాన్ని ఖాయం చేశాడు. కీలక సింగిల్స్ మ్యాచ్ లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నడాల్ 6-3, […]

డేవిస్ కప్ విజేతగా స్పెయిన్
X
  • ఆరోసారి టైటిల్ నెగ్గిన నడాల్ ఆర్మీ
  • ఫైనల్లో కెనడాపై స్పెయిన్ విజయం

ప్రపంచ టెన్నిస్ పురుషుల టీమ్ చాంపియన్లకు ఇచ్చే డేవిస్ కప్ ను టాప్ ర్యాంకర్ రాఫెల్ నడాల్ నాయకత్వంలోని స్పెయిన్ జట్టు ఆరోసారి గెలుచుకొంది.

మాడ్రిడ్ వేదికగా ముగిసిన 2019 సీజన్ డేవిస్ కప్ టైటిల్ సమరంలో నడాల్ తుదివరకూ పోరాడి తనజట్టుకు డేవిస్ కప్ విజయాన్ని ఖాయం చేశాడు.

కీలక సింగిల్స్ మ్యాచ్ లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు నడాల్ 6-3, 7-6తో రష్యా ఆటగాడు షఫలోవ్ ను ఓడించడం ద్వారా విజయానికి మార్గం సుగమం చేశాడు.

సెమీఫైనల్లో గ్రేట్ బ్రిటన్ ను ఓడించడంలో ప్రధానపాత్ర వహించిన నడాల్ ఫైనల్లోనూ తనజట్టును ముందుండి విజయపథంలో నడిపించాడు.

సరికొత్త ఫార్మాట్లో నిర్వహించిన ఈ డేవిస్ కప్ ఫైనల్స్ టోర్నీలో సెర్బియా, కెనడా, గ్రేట్ బ్రిటన్, రష్యా, స్పెయిన్, ఆస్ట్ర్ర్రేలియా జట్లు తలపడ్డాయి.

119 సంవత్సరాల డేవిస్ కప్ చరిత్రలో స్పెయిన్ ట్రోఫీ అందుకోడం ఇది ఆరోసారి మాత్రమే. ఈ విజయంతో ట్రోఫీతో పాటు 21 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీని సైతం స్పెయిన్ సొంతం చేసుకోగలిగింది.

నడాల్ ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ తో పాటు…తన జట్టును డేవిస్ కప్ విజేతగా కూడా నిలపడం ద్వారా 2019 సీజన్ ను ముగించగలిగాడు.

First Published:  25 Nov 2019 10:13 PM GMT
Next Story