రంగమార్తాండ మొదలైంది

లాంగ్ గ్యాప్ తర్వాత కృష్ణవంశీ మరోసారి మెగాఫోన్ పట్టుకున్నారు. క్రియేటివ్ డైరక్టర్ అనే ట్యాగ్ లైన్ కు భిన్నంగా ఈసారి తన సొంత క్రియేటివిటీని పక్కనపెట్టి, ఓ రీమేక్ సబ్జెక్ట్ ను హ్యాండిల్ చేస్తున్నాడు. అదే రంగమార్తాండ. మరాఠీలో వచ్చిన నటసామ్రాట్ అనే సినిమాకు రీమేక్ ఇది.

నిన్న వైజాగ్ లో ఈ షూటింగ్ ప్రారంభించారు. మొదటి సన్నివేశానికి తేజ గౌరవ దర్శకత్వం వహించగా న్యూమరాలజిస్ట్ బాలు మున్నాగి క్లాప్ ఇచ్చారు. 2016లో వచ్చిన మరాఠీ సినిమా ‘నటసామ్రాట్’కి రీమేక్ గా తెరకెక్కనున్న సినిమాలో ప్రకాశ్ రాజ్ ఆయన సరసన రమ్యకృష్ణ నటించనున్నారు. మరాఠీలో నటసామ్రాట్ సినిమా ఓ కల్ట్ క్లాసిక్ గా పేరుతెచ్చుకుంది. నానా పటేకర్ కు లెక్కలేనన్ని అవార్డులు తెచ్చిపెట్టింది.

ఇక ‘శ్రీఆంజనేయం’ తరువాత కృష్ణవంశీ దర్శకత్వంలో రమ్యకృష్ణ చేస్తున్న సినిమా ఇదే. అభిషేక్, మధు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం మరో అదనపు ఆకర్షణ. సినిమా ఎక్కువ భాగం షూటింగ్ వైజాగ్ పరిసర ప్రాంతాల్లోనే చేయబోతున్నారు. మార్చికి ఫస్ట్ కాపీ రెడీ చేయాలనేది టార్గెట్.