ట్రెండింగ్ లో మహేష్ కటౌట్

నిన్నంతా ఒకటే ట్రెండింగ్. అదేదో సినిమా టీజర్ కాదు, లిరికల్ వీడియో అంతకంటే కాదు. జస్ట్ ఓ కటౌట్. అవును.. ఓ కటౌట్ నిన్నంతా ట్రెండింగ్ లోకి ఎక్కింది. అది మహేష్ బాబు కటౌట్ కావడం విశేషం.

ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ మూవీ సంక్రాంతికి థియేటర్లలోకి వస్తోంది. కానీ అంతవరకు ఆగలేకపోయారు ఫ్యాన్స్. నిన్నట్నుంచే హంగామా షురూ చేశారు. హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ ముందు ఏకంగా 81 అడుగుల మహేష్ కటౌట్ ను పెట్టారు. రిలీజ్ కు ఇన్ని రోజుల ముందు నుంచే కటౌట్ పెట్టడం ఓ రికార్డ్ అయితే, అంత పెద్ద కటౌట్ పెట్టడం మరో రికార్డు. దీంతో నిన్నంతా ఈ కటౌట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మహేష్ బాబు సినిమాపై చాలా అంచనాలున్నాయి. అనీల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న మూవీ కావడంతో పాటు విజయశాంతి, బండ్ల గణేశ్ లాంటి సీనియర్లు నటించడం, మూవీలో కామెడీ చాలా బాగుంటుందనే టాక్ రావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. సంక్రాంతి కానుకగా జనవరి 11న థియేటర్లలోకి వస్తోంది సరిలేరు నీకెవ్వరు సినిమా.