Telugu Global
NEWS

పీబీఎల్ కు సైనా, శ్రీకాంత్ డుమ్మా

వరుస వైఫల్యాలతో టాప్ స్టార్లు ఢీలా ఒలింపిక్స్ బెర్త్ ల కోసం లీగ్ కు దూరం కాసులు కురిపించే ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ కు దూరంగా ఉండాలని భారత బ్యాడ్మింటన్ టాప్ స్టార్లు కిడాంబీ శ్రీకాంత్, సైనా నెహ్వాల్ నిర్ణయించారు. 2020 టోక్యో ఒలింపిక్స్ పురుషుల, మహిళల సింగిల్స్ కు అర్హత సాధించాలంటే విశ్రాంతితో పాటు తగిన ఫిట్ నెస్ , ఏకాగ్రత అవసరమని ఈ ఇద్దరు సీనియర్ ప్లేయర్లు భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న […]

పీబీఎల్ కు సైనా, శ్రీకాంత్ డుమ్మా
X
  • వరుస వైఫల్యాలతో టాప్ స్టార్లు ఢీలా
  • ఒలింపిక్స్ బెర్త్ ల కోసం లీగ్ కు దూరం

కాసులు కురిపించే ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ కు దూరంగా ఉండాలని భారత బ్యాడ్మింటన్ టాప్ స్టార్లు కిడాంబీ శ్రీకాంత్, సైనా నెహ్వాల్ నిర్ణయించారు.

2020 టోక్యో ఒలింపిక్స్ పురుషుల, మహిళల సింగిల్స్ కు అర్హత సాధించాలంటే విశ్రాంతితో పాటు తగిన ఫిట్ నెస్ , ఏకాగ్రత అవసరమని ఈ ఇద్దరు సీనియర్ ప్లేయర్లు భావిస్తున్నారు.

ఇటీవలి కాలంలో వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న సైనా, శ్రీకాంత్..తగినంత విశ్రాంతి తీసుకొని…మెరుగైన ఫిట్ నెస్ తో..నిలకడగా రాణించడం ద్వారా ఒలింపిక్స్ బెర్త్ లు సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు.

భారత మహిళల సింగిల్స్ టాప్ ప్లేయర్ పీవీ సింధు సైతం ప్రపంచకప్ టైటిల్ విజయం తర్వాత వరుసగా ఐదు గ్రాండ్ ప్రీ టోర్నీల ప్రారంభరౌండ్లోనే పరాజయాలు పొందిన సంగతి తెలిసిందే.

అంతేకాదు…విశ్రాంతి లేకుండా టోర్నీ వెంట టోర్నీ ఆడుతున్న కారణంగానే భారత ప్లేయర్లు పరాజయాలు చవిచూడాల్సి వస్తోందని చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఇటీవలే చెప్పడం కూడా విశేషం.

First Published:  25 Nov 2019 9:57 PM GMT
Next Story