Telugu Global
International

కరుగుతున్న కాషాయం.... దేశంలో 71 నుంచి 40 శాతం ప్రాంతానికి పరిమితం

పార్లమెంట్‌ ఎన్నికల్లో భారీ విజయాన్ని బీజేపీ సొంతం చేసుకున్నప్పటికీ…. రాష్ట్రాల్లో మాత్రం కాషాయ పార్టీ క్రమంగా పట్టుకోల్పోతున్నట్టు కనిపిస్తోంది. పెద్దపెద్ద రాష్ట్రాల్లోనూ అధికారానికి దూరమవుతోంది. 2017లో దేశంలోని 71 శాతం ప్రాంతంలో అధికారాన్ని చేజెక్కించుకున్న బీజేపీ… ప్రస్తుతం 40శాతం ప్రాంతానికి పరిమితమైంది. మహారాష్ట్రలోనూ అధికారం కోల్పోవడంతో బీజేపీ ప్రభావంపై చర్చ మొదలైంది. 2014లో ఏడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ 2018 వచ్చే సరికి 21 రాష్ట్రాల్లో పాగా వేసింది. మోడీ, షా చాణిక్యం వల్లే ఇది […]

కరుగుతున్న కాషాయం.... దేశంలో 71 నుంచి 40 శాతం ప్రాంతానికి పరిమితం
X

పార్లమెంట్‌ ఎన్నికల్లో భారీ విజయాన్ని బీజేపీ సొంతం చేసుకున్నప్పటికీ…. రాష్ట్రాల్లో మాత్రం కాషాయ పార్టీ క్రమంగా పట్టుకోల్పోతున్నట్టు కనిపిస్తోంది. పెద్దపెద్ద రాష్ట్రాల్లోనూ అధికారానికి దూరమవుతోంది.

2017లో దేశంలోని 71 శాతం ప్రాంతంలో అధికారాన్ని చేజెక్కించుకున్న బీజేపీ… ప్రస్తుతం 40శాతం ప్రాంతానికి పరిమితమైంది. మహారాష్ట్రలోనూ అధికారం కోల్పోవడంతో బీజేపీ ప్రభావంపై చర్చ మొదలైంది.

2014లో ఏడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ 2018 వచ్చే సరికి 21 రాష్ట్రాల్లో పాగా వేసింది. మోడీ, షా చాణిక్యం వల్లే ఇది సాధ్యమైందని అంతా మెచ్చుకున్నారు. కానీ ఆ తర్వాత మెల్లగా పలు రాష్ట్రాల్లో పట్టుకోల్పోతోంది. కీలకమైన రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్ర, కశ్మీర్‌, ఏపీ లాంటి రాష్ట్రాల్లో బీజేపీ, దాని పొత్తు పార్టీలు అధికారాన్ని కోల్పోయాయి. కర్నాటకలో కాంగ్రెస్‌, దేవగౌడ పార్టీలోని రెబల్స్ వల్ల బీజేపీ అధికారంలోకి వచ్చింది.

ప్రస్తుతం బీజేపీ, దాని మిత్రపక్షాల చేతుల్లో ఉన్న పెద్ద రాష్ట్రాలు గుజరాత్, ఉత్తరప్రదేశ్‌, కర్నాటక, బీహర్‌ మాత్రమే. దక్షిణాదిలో బీజేపీ ఒక్క కర్నాటకలో మాత్రమే అధికారంలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో గానీ, తమిళనాడులో గానీ ఆ పార్టీకి కనీస ఓటు బ్యాంకు కూడా ఇప్పటికీ లేదు.

First Published:  26 Nov 2019 10:17 PM GMT
Next Story