చిరంజీవిపై బాంబ్ పేల్చిన సీనియర్ నటుడు

ఇండస్ట్రీలో చాలామందిపై చాలామందికి ఈర్ష్య. అసూయ ఉంటాయి. కొంతమంది వాటిని బయటపెడతారు, మరికొంతమంది సమయం వచ్చినప్పుడు చూపిస్తారు. ఇప్పుడు గిరిబాబు వంతు వచ్చింది. చిరంజీవిపై ఓ రేంజ్ లో పంచ్ లు వేశారు ఈ సీనియర్ నటుడు. మరీ ముఖ్యంగా సైరా లాంటి సినిమా చేసి చిరంజీవి తప్పు చేశారని గిరిబాబు అభిప్రాయపడ్డారు.

సైరా సినిమాను ప్రత్యేకంగా వీక్షించిన గిరిబాబు, అలాంటి కథ ఎంచుకొని చాలా తప్పు చేశావని చిరంజీవితో చెప్పారట. ఇప్పటితరానికి స్వతంత్ర పోరాటాలపై సినిమాలు పెద్దగా నచ్చవని.. పాకిస్థాన్ పై యుద్ధాలు, క్లబ్బులు-పబ్బుల్లో సినిమాలు మాత్రమే నచ్చుతాయంటున్నారు గిరిబాబు. స్వంతత్ర పోరాటంపై సినిమాలు చేస్తే ఇప్పుడు ఎవ్వరూ చూడరని, అదే విషయాన్ని చిరంజీవికి చెప్పానన్నారు గిరిబాబు.

గిరిబాబు చెప్పినట్టే సైరా సినిమా పెద్దగా ఆడలేదు. రీసెంట్ గా కంప్లీట్ రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వలేదు. యావరేజ్ గా మాత్రమే ఆడింది. బాహుబలి రికార్డుల్ని బ్రేక్ చేస్తుందనుకున్న ఈ సినిమా ఆ రేంజ్ కు వెళ్లలేకపోయింది.