Telugu Global
NEWS

పీబీఎల్ వేలంలో సింధు వేలం ధర 77 లక్షలు

బెంగలూరు జట్టులో తాయ్ జు యింగ్ పీబీఎల్ వేలంలో 154 మంది ప్లేయర్లు ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ 5వ సీజన్ వేలంలో ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్ తాయ్ జు ఇంగ్, భారత స్టార్ ప్లేయర్ పీవీ సింధు రికార్డు ధరను దక్కించుకొన్నారు. 2020 మార్చిలో ప్రారంభయ్యే 21 రోజుల ఈ లీగ్ 5వ సీజన్లో 7 ఫ్రాంచైజీలకు చెందిన జట్లు ఢీ కొనబోతున్నాయి. న్యూఢిల్లీలో జరిగిన వేలంలో మొత్తం 154 ప్లేయర్లను ఉంచగా..71 మందికి మాత్రమే […]

పీబీఎల్ వేలంలో సింధు వేలం ధర 77 లక్షలు
X
  • బెంగలూరు జట్టులో తాయ్ జు యింగ్
  • పీబీఎల్ వేలంలో 154 మంది ప్లేయర్లు

ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ 5వ సీజన్ వేలంలో ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్ తాయ్ జు ఇంగ్, భారత స్టార్ ప్లేయర్ పీవీ సింధు రికార్డు ధరను దక్కించుకొన్నారు.

2020 మార్చిలో ప్రారంభయ్యే 21 రోజుల ఈ లీగ్ 5వ సీజన్లో 7 ఫ్రాంచైజీలకు చెందిన జట్లు ఢీ కొనబోతున్నాయి.

న్యూఢిల్లీలో జరిగిన వేలంలో మొత్తం 154 ప్లేయర్లను ఉంచగా..71 మందికి మాత్రమే వివిధ ఫ్రాంచైజీలు తమజట్టులో చోటు కల్పించగలిగాయి.

డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు బుల్స్ జట్టు 77 లక్షల రూపాయల ధరకు తాయ్ జు యింగ్ ను వేలం ద్వారా సొంతం చేసుకోగా..వరుస వైఫల్యాలతో ఢీలాపడిన ప్రపంచ చాంపియన్ సింధు సైతం 77 లక్షలరూపాయల ధరకే …హైదరాబాద్ హంటర్స్ జట్టులో చోటు దక్కించుకోగలిగింది.

భారత బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కుమార్తె గాయత్రికి 2 లక్షల రూపాయల ధర మాత్రమే దక్కింది.

పురుషుల సింగిల్స్ లో సాయి ప్రణీత్ ను 32 లక్షల రూపాయల ధరకు బెంగళూరు ఫ్రాంచైజీ సొంతం చేసుకొంది.

హైదరాబాద్, చెన్నై, లక్నో, బెంగళూరు నగరాలు వేదకగా మూడువారాలపాటు జరిగే లీగ్ 5వ సీజకు స్టార్ ప్లేయర్లు కిడాంబీ శ్రీకాంత్, సైనా నెహ్వాల్ ఫిట్ నెస్ సమస్యలతో దూరమయ్యారు.

First Published:  26 Nov 2019 9:45 PM GMT
Next Story