ఉదయ్ కిరణ్ బయోపిక్…. ఆ ఫ్యామిలీని ఢీకొట్టే హీరో ఎవరు?

ఉదయ్ కిరణ్.. టాలీవుడ్ లో ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా దూసుకొచ్చిన హీరో.. చిత్రం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్ ఆ తర్వాత నువ్వునేను, మనసంతా నువ్వే చిత్రాల వరుస విజయాలతో అప్పట్లో టాలీవుడ్ లోనే సంచలనం సృష్టించాడు. యూత్ ఫేవరెట్ హీరోగా మారిపోయాడు.

అయితే ఆ తర్వాత చిరంజీవి కూతురుతో పెళ్లి రద్దు కావడం.. అది వివాదాస్పదం కావడం.. సినిమాల్లో ఒడిదుడుకులతో 2014లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయ్ ఎంత ఎత్తుకు ఎదిగాడో అంతే స్థాయిలో అధ:పాతాళానికి పడిపోయాడు.

మంచి కథా బలమున్న ఉదయ్ కిరణ్ జీవితాన్ని… బయోపిక్ గా తీయాలన్న ఆలోచన తెలుగు దర్శకుల్లో చాలా మందికి వచ్చింది. ఉదయ్ కిరణ్ ను టాలీవుడ్ కు పరిచయం చేసిన దర్శకుడు తేజ ఈ బయోపిక్ తీస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన తీయనని స్పష్టం చేశాడు. ఇప్పుడు కొత్త దర్శకులు కొందరు ఉదయ్ కిరణ్ బయోపిక్ ను తీయడానికి రెడీ అవుతున్నారట.

ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ ఎత్తుపల్లాలు చూపించాల్సి ఉంటుంది. మెగా ఫ్యామిలీ ఎపిసోడ్ ఖచ్చితంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో ఈ సినిమాలో నటించడానికి ఏ హీరో కూడా ముందుకు రాని పరిస్థితి ఉంది.

ఇప్పటికే సందీప్ కిషన్, రాజ్ తరుణ్ లాంటి హీరోల పేర్లు వినిపించినా వారు అధికారికంగా ఓకే చెప్పలేదు. ఇప్పుడు హీరో నాని పేరు కూడా వినిపిస్తోంది.

మరి మెగా ఫ్యామిలీని ఢీకొట్టే ఈ పాత్రను ఉదయ్ కిరణ్ లాగానే ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన నాని చేస్తాడా లేదా అన్నది వేచిచూడాలి.