ఆ సినిమా నేను చేయడం లేదు

వరుసగా వస్తున్న కథనాలు, ఏకథాటిగా వినిపిస్తున్న పుకార్లతో సందీప్ కిషన్ విసిగిపోయాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల మధ్య మీడియా ముందుకొచ్చాడు. ఉదయ్ కిరణ్ బయోపిక్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశాడు. ఉదయ్ కిరణ్ బయోపిక్ లో సందీప్ కిషన్ నటించబోతున్నాడంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని ఖండించాడు సందీప్.

“2 రోజుల నుంచి ఉదయ్ కిరణ్ బయోపిక్ కు సంబంధించి చాలా రూమర్లు వింటున్నాను. దీనిపై నా నుంచి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. బయోపిక్ కు సంబంధించి ఎవరూ మమ్మల్ని సంప్రదించలేదు. ప్రస్తుతానికి నాకు బయోపిక్స్ చేయాలనే ఆలోచన కూడా లేదు.”

ఈ మేరకు మీడియాకు ఏకంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు ఈ హీరో. ఇతడు ఇంక కంగారు పడ్డానికి ఓ కారణం ఉంది. ఉదయ్ కిరణ్ బయోపిక్ లో మెగా కాంపౌండ్ కనెక్ట్ ఉంది. అందులో కొన్ని వివాదాస్పద అంశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సినిమాలో సందీప్ నటిస్తే అది కచ్చితంగా సంచలనం అవుతుంది. పైగా మెగా కాంపౌండ్ కు అస్సలు నచ్చదు. ఇటు చూస్తే, సందీప్ కిషన్ కుటుంబం మొత్తం మెగా ఫ్యామిలీకి క్లోజ్.

సో.. ఇలాంటి బయోపిక్ లో తను నటించే అవకాశం లేదని సందీప్ కిషన్ క్లారిటీ ఇచ్చాడు. కేవలం ఉదయ్ కిరణ్ బయోపిక్ మాత్రమే కాదని, ఏ బయోపిక్ లో నటించే ఆలోచన ప్రస్తుతానికి లేదంటున్నాడు ఈ యంగ్ హీరో.