Telugu Global
National

మా ఉనికి కోల్పోయాం... బాబుకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కట్టిన దళితులు

రాజధాని పర్యటనకు వస్తున్న చంద్రబాబుపై రైతులు, దళితులు భగ్గుమంటున్నారు. ఐదేళ్లు సీఎంగా ఉండి రాజధాని ప్రాంతాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయకుండా గాలి కొదిలేసిన చంద్రబాబు… ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని వస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఆయన పర్యటించే ప్రాంతంలో రోడ్లకు ఇరువైపులా వందల సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు దళిత ద్రోహి అంటూ దళితులు ఫ్లెక్సీలు కట్టారు. జీవో 41 తెచ్చి రాజధాని ప్రాంతంలోని దళితుల గొంతులు కోసిన చంద్రబాబు… ఏముఖం పెట్టుకుని […]

మా ఉనికి కోల్పోయాం... బాబుకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కట్టిన దళితులు
X

రాజధాని పర్యటనకు వస్తున్న చంద్రబాబుపై రైతులు, దళితులు భగ్గుమంటున్నారు. ఐదేళ్లు సీఎంగా ఉండి రాజధాని ప్రాంతాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయకుండా గాలి కొదిలేసిన చంద్రబాబు… ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని వస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఆయన పర్యటించే ప్రాంతంలో రోడ్లకు ఇరువైపులా వందల సంఖ్యలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు దళిత ద్రోహి అంటూ దళితులు ఫ్లెక్సీలు కట్టారు.

జీవో 41 తెచ్చి రాజధాని ప్రాంతంలోని దళితుల గొంతులు కోసిన చంద్రబాబు… ఏముఖం పెట్టుకుని వస్తున్నారని ఫ్లెక్సీల ద్వారా ప్రశ్నించారు. రాజధాని ప్రాంతం గురించి ముందే తెలుసుకుని దళితులకు సంబంధించిన భూములను తక్కువ ధరకు టీడీపీ నేతలు కొట్టేసిన తర్వాత…. కుట్రపూరితంగా చంద్రబాబు రాజధానిని ప్రకటించారని ఆరోపించారు. చంద్రబాబు చేసిన కుట్ర వల్ల రాజధాని ప్రాంతంలో తాము ఉనికిని కోల్పోయామని ఆవేదన చెందారు.

చంద్రబాబు హయాంలో ఒక్క రోడ్డు కూడా వేయకుండా ఇప్పుడు రాజధానిని చంపేశారని పర్యటనకు రావడం .. కేవలం ప్రజలను రెచ్చగొట్టేందుకేనని ఆరోపించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా పలు స్లోగన్లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కరకట్ట నుంచి రాయపూడి వరకు ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. బాహుబలి గ్రాఫిక్స్‌ తప్ప చంద్రబాబు హయాంలో ఏమైనా సాధించారా? అని రైతులు ప్రశ్నించారు.

గ్రామ కంఠాల సమస్యను కూడా పరిష్కరించలేదని విమర్శించారు. దళితులకు సంబంధించిన అసైన్డ్ భూములను లాక్కుని రాజధాని ప్రాంతం నుంచి దళితులను తరిమేసిన ఘనత చంద్రబాబుదేనని ఫ్లెక్సీలు కట్టిన ప్రజలు విమర్శించారు.

అమరావతిలోని తమ భూములను చూసేకునేందుకే చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ నేతలు పర్యటనకు వస్తున్నారన్నారు. రాజధాని ప్రాంతంలోని రెండు అసెంబ్లీ స్థానాల్లోనూ ఓడిపోయిన టీడీపీకి ఇంకా బుద్ది రాలేదని రైతులు విమర్శించారు.

First Published:  28 Nov 2019 5:10 AM GMT
Next Story