పనిపూర్తిచేసిన కల్యాణ్ రామ్

కల్యాణ్ రామ్ మరో సినిమా పూర్తిచేశాడు. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఈ హీరో నటిస్తున్న ఎంత మంచివాడవురా సినిమా షూటింగ్ పూర్తిచేసుతుంది. మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల చేయబోతున్నారు. సినిమా ఆఖరి షెడ్యూల్ ను కేరళలోని మున్నార్ లో షూట్ చేశారు.

ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్‌ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘శతమానం భవతి’ చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్‌ వేగేశ్న దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. పాటల్ని డిసెంబరులో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందించాడు.

సినిమాలో మొత్తం నాలుగు పాటలు, నాలుగు ఫైట్లు ఉంటాయి. క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ టోటల్ సినిమాకే హైలెట్ అవుతుందని, ఎక్కువ బడ్జెట్ కూడా ఆ ఫైట్ కే అయిందని చెబుతోంది యూనిట్. గోదావరి నదిలో ఈ ఫైట్ సీక్వెన్స్ షూట్ చేశారు. సతీష్ వేగేశ్న తీసిన శతమానంభవతి సినిమా సంక్రాంతికే వచ్చి సూపర్ హిట్ అయింది. ఈ సెంటిమెంట్ ఈ తాజా చిత్రం విషయంలో కూడా వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు.